EntertainmentLatest News

అందరికీ దిమ్మ తిరిగిపోతుంది : కొడుకు ఎంట్రీ గురించి సుధీర్‌బాబు


సాధారణంగా హీరోలు తమ నట వారసులు ఇండస్ట్రీలోకి రావడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. తన కొడుకు తనను మించిన వాడు కావాలని ఏ తండ్రయినా కోరుకుంటాడు. ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు హీరో సుధీర్‌బాబు. త్వరలోనే తన పెద్ద కుమారుడు చరిత్‌ మానస్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎంతో గర్వంగా చెబుతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన చరిత్‌.. ప్రస్తుతం నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. చరిత్‌ చేసిన విన్యాసాల వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అవుతున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. 

చరిత్‌ మానస్‌ ఎంట్రీ గురించి హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ ‘మూడు సంవత్సరాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక తుపాన్‌ వస్తుంది. మీరందరూ రెడీగా ఉండండి. హీరో లుక్‌ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. మరో మూడేళ్ళు ఇలాగే కష్టపడితే.. ఎవ్వడూ అతని దగ్గర్లోకి కూడా రాలేడు. ఖచ్చితంగా అందరికీ దిమ్మ తిరిగిపోతుంది’ అంటూ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. 



Source link

Related posts

Subhashree Eliminated From Bigg Boss Telugu 7 బిగ్ బాస్ 7 నుంచి ఆమె అవుట్

Oknews

Stone pelted on CM YS Jagan వైఎస్ జగన్ పై దాడి.. కంటికి గాయం!

Oknews

ఇది శ్రీవల్లి జాతర లుక్.. తగ్గేదేలే

Oknews

Leave a Comment