ప్రతి నెల కొన్ని సినిమాలు ప్రకటించడం వాటిని మరో తేదీకి వాయిదా వేయడం టాలీవుడ్ లో కామన్ ప్రాక్టీస్ లా మారింది. ఆగస్ట్ నెలలో కూడా అలాంటి వాయిదాలుంటాయని భావించారు. కానీ ఆగస్ట్ లో పోస్టుపోన్లు లేవు. కొన్ని సినిమాలు పోటీకి సై అంటున్నాయి. ఓవరాల్ గా 3 సినిమాలపైనే అందరి దృష్టి ఉంది.
శివం భజే సినిమాతో ఆగస్ట్ బాక్సాఫీస్ షురూ కాబోతోంది. అశ్విన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో యాక్షన్-థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పాటు మైథలాజికల్ టచ్ కూడా ఉంది. స్టోరీలైన్ బయటపెట్టకుండా ట్రయిలర్ కట్ చేశారు. ఇక ఆ తర్వాత బడ్డీ, తిరగబడరా సామీ సినిమాలు వస్తున్నాయి.
లాంగ్ గ్యాప్ తర్వాత బడ్డీ సినిమాతో అల్లు శిరీష్ రెడీ అయ్యాడు. ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారు. అదే అంశాన్ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పోటీగా రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామీ కూడా వస్తోంది. మొన్ననే పురుషోత్తముడు మూవీతో థియేటర్లలోకి వచ్చిన రాజ్ తరుణ్, మినిమం గ్యాప్ లోనే మరో సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. ఇదేంటని అడిగితే అంతా కరోనా మహత్యం అంటున్నాడు.
ఇక మొదటి వారంలోనే తుఫాన్, ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు, విరాజి, లారి, యావరేజ్ స్టూడెంట్ నాని, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇక రెండోవారం కమిటీ కుర్రాళ్లు సినిమా వస్తోంది. ప్రస్తుతానికి ఈవారంలో రిలీజ్ అవుతున్న సినిమా ఇదొక్కటే. ఆ టైమ్ కు మరో 2 సినిమాలు పోటీలో నిలిచే అవకాశం ఉంది. మెగా డాటర్ నిహారిక కొణెదల నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ఇది.
ఇక మూడోవారంలో అసలైన పోటీ. ఆ నెల మొత్తంలో అంతా ఎదురుచూస్తున్న డేట్ ఆగస్ట్ 15.. ఈ తేదీకి ముందుగా డబుల్ ఇస్మార్ట్ ను ప్రకటించారు. ఆ తర్వాత ఊహించని విధంగా మిస్టర్ బచ్చన్ వచ్చి చేరింది. అలా రవితేజ-రామ్ మధ్య బాక్సాఫీస్ పోటీకి తెరలేచింది. హీరోలకు మాత్రమే కాదు, అటు హరీశ్ శంకర్ కు, ఇటు పూరి జగన్నాధ్ కు కూడా ఈ సినిమాలు చాలా కీలకం. ఈ మూవీస్ తో పాటు అదే తేదీకి ఆయ్, తంగలాన్ సినిమాలు కూడా వస్తున్నాయి.
నాలుగోవారంలో ప్రస్తుతానికి మారుతీనగర్ సుబ్రమణ్యం అనే సినిమా లాక్ అయింది. రావు రమేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా ఇది. ట్రయిలర్ ఇప్పటికే క్లిక్ అయింది, హిలేరియస్ గా ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించాల్సి ఉంది.
ఇక ఆగస్ట్ బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు వస్తోంది సరిపోదా శనివారం. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇలా ఆగస్ట్ నెలలో అటుఇటుగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, సరిపోదా శనివారం సినిమాలపైనే అందరి చూపు ఉంది. ఆగస్ట్ బాక్సాఫీస్ భవితవ్యం కూడా ఈ సినిమాలపైనే ఆధారపడి ఉంది.
The post అందరి చూపు ఆ 3 సినిమాలపైనే appeared first on Great Andhra.