GossipsLatest News

అందుకే ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అయ్యింది


సినిమా షూటింగ్ మొదలైనప్పుడు చాలామంది నటులని ఎంపిక చేసి వారితో కొన్ని సీన్స్ తెరకెక్కించాక అవసరం లేవన్న సీన్స్ ని, లెంత్ పెరిగిపోతుంది అనుకున్న సీన్స్ ని ఎడిటింగ్ లో లేపెయ్యడం తరచూ జరుగుతూనే ఉంటుంది, అందులో పెద్ద నటులైనా ఉండనివ్వండి, జూనియర్ ఆర్టిస్ట్ లైన ఉండనివ్వండి, ఎడిటింగ్ లో చాలామంది సీన్స్ ఉండవు. సినిమా చూసాక ఆ విషయంలో చాలామంది ఫీలైన సందర్భాలు చూసాము. ఇప్పుడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఫ్యామిలీ స్టార్ టీం పై, పరశురామ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

గీత గోవిందం కాంబో విజయ్ దేవరకొండ-పరశురామ్ కలిసి ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గీత గోవిందం సూపర్ హిట్ అవడంతో ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు పెరిగాయి. దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ కథని నమ్మి విజయ్ తో ఈ సినిమా చేసారు.. అంటేనే అంచనాలు రాకుండా ఎలా ఉంటాయి. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ, విడుదలకు ముందు ప్రమోషన్స్ లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని కలిసి వారితో సరదాగా సినిమాని ప్రమోట్ చేసారు. సినిమా విడుదలకు ముందు యూట్యూబర్ ఫామిలీస్, ఇన్స్టా లో బాగా ఫేమస్ అయిన వారి ఫ్యామిలిస్ తో కలిసి దిల్ రాజు, విజయ్ దేవరకొండ సందడి చేసారు. కాకపోతే గత శుక్రవారం విడుదలైన ఫ్యామిలి స్టార్ అనుకున్న అంచనాలు రీచ్ అవ్వలేదు. 

అయితే ఇప్పుడొక ఇన్ఫ్లుయన్సర్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నన్ను వాడుకుని నాకు అన్యాయం చేసారు అందుకే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆశ బొర్ర అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆ అమ్మాయిని ఫ్యామిలీ స్టార్ లో ఓ కేరెక్టర్ కోసం సంప్రదించి తీసుకొచ్చి కొన్ని సీన్స్ తీశారు. కాని సినిమాలో చూసుకుంటే ఆమె సీన్స్ లేపేశారు. దానితో ఆమెకి మండింది. సినిమాలో కొన్ని సీన్స్ లో నటించాను, ఫ్యామిలీ స్టార్ ప్రతి ఈవెంట్ లో కనిపించాను, కానీ నన్ను ఫ్యామిలీ స్టార్ టీం స్టాఫ్ లా వాడుకుని వదిలేసింది, ఇంతోటి దానికి నా టైం వేస్ట్ చేసారు, మీ టైం వేస్ట్ అయ్యింది, ఈ పాత్ర మీరే చెయ్యాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి క్యాస్టింగ్ డైరెక్టర్ వరకు అనవరసంగా ఫోన్స్ చేసి హంగామా చేసారు. 

మా పనులు మానుకుని, హెల్త్ బాగోకపోయినా ఒక రోజంతా ఇచ్చిన మాట కోసం యాంటీ బయోటిక్స్ వేసుకుని నిలబడి ఉన్నాను, అయినా కనీసం ఒక్క డైలాగ్ లేకుండా చేసారు. విజయ్ దేవరకొండ తో ఒక్క డైలాగ్ చెప్పినా బావుండేది. నాకు పారితోషికం ఇవ్వలేదు, హోటల్ రూమ్ బిల్ ఇవ్వలేదు, ట్రావెలింగ్ చార్జెస్ కూడా ఇవ్వకుండా ఫోన్ ఎత్తడమే లేదు, వాహ్ మీరు సూపర్. నా కళ్ళు తెరిపించారు, నన్ను వాడుకుని వదిలేసారు, అందుకే ఫ్యామిలీ స్టార్ అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ ఆశ బొర్ర సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.  



Source link

Related posts

ఓటీటీలోకి ఆస్కార్ విజేత ‘ఓపెన్‌హైమర్’.. నోలన్ ఫ్యాన్స్ కి పండగే!

Oknews

Poonam Pandey dies of cervical cancer షాకింగ్: పూనమ్ పాండే మృతి

Oknews

సైలెంట్ గా ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్

Oknews

Leave a Comment