EntertainmentLatest News

అందుకే సినిమాల్లో బిజీగా ఉన్నా..మొదటి సారి సీక్రెట్ ని చెప్పిన శ్రీలీల  


తెలుగు అమ్మాయికి ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటు వెళ్తున్న అచ్చ తెలుగు నటి శ్రీలీల(sreeleela)ఈ మధ్య కాలంలో చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేదు ఏ సినిమాలో చూసినా కూడా హీరోయిన్ గా శ్రీలీల ఉండాల్సిందే. అసలు ఒక సినిమాకి డేట్స్ ఖాళీ లేక ఆమె నో చెప్పడమే తప్ప అందరి ఫస్ట్ ఛాయస్ శ్రీలీలనే. తాజా ఆమె సినిమాలకి సంబంధించిన  తన  సీక్రెట్ ఒక దాన్ని బయటపెట్టింది.

అసలు అలుపన్నది లేకుండా శ్రీలీల వరుసగా సినిమాలు ఎలా చేయగలుగుతుంది అనే దానిమీద  తాజా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆ సీక్రెట్ ని బయటపెట్టింది. నేను ఎప్పుడు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ పర్సన్ లా ఉంటాను అంటే షూటింగ్ లో ఉన్నప్పుడు నేను చేసే క్యారక్టర్ గురించి తప్ప ఇంకే విషయాలు గురించి ఆలోచించను. అలాగే షూటింగ్ నుంచి వెళ్ళిపోయాక ఇంక సినిమా గురించి ఆలోచించను అని  చెప్పింది. అందుకే నేను ఒకే రోజు రెండు మూడు షూటింగ్స్ లో అయిన ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పాల్గొంటున్నానని కూడా ఆమె చెప్పింది. అలాగే తన చదువు విషయంలో కూడా ఇదే సూత్రాన్ని అవలంబిస్తానని చెప్పింది.

ఇప్పుడు శ్రీలీల చెప్పిన ఈ విషయాలని  సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చాలా మంది అందుకే శ్రీ లీల వరుస పెట్టి సినిమాలు చేస్తుందని అనుకుంటున్నారు. అలాగే  చదువు కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. శ్రీ లీల రీసెంట్ గా  హీరోయిన్ గా చేసిన గుంటూరు కారం(guntur kaaram) టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అలాగే ఆ సినిమాలోని ఆమె క్యారక్టర్ కి కూడా  మంచి గుర్తింపు వచ్చింది. 

 



Source link

Related posts

Bandla Ganesh, Bunny Mama hopes evaporated! బండ్ల గణేష్, బన్నీ మామ ఆశలు ఆవిరి!

Oknews

పోలీసులు నా భర్త నోట్లో యాసిడ్ పోసి కొట్టారు: తారా చౌదరి!

Oknews

తీరా కాదల్ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment