EntertainmentLatest News

అఖండ 2 కి తమన్ లేకపోతే ఎలా!బాలయ్య కల్పించుకోవాలంటున్న ఫ్యాన్స్ 


మ్యూజిక్ డైరెక్టర్ తమన్(taman)సినీ సంగీత జర్నీ గురించి అందరకి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన పాటలకి  ప్రాణం పోసి ప్రేక్షకుల నోటి వెంట నిత్యం పాడుకునేలా  చేసాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చే ఆర్ ఆర్ కి  థియేటర్స్ బద్దలవ్వాల్సిందే. అందుకు ఉదాహరణ నందమూరి బాలయ్య(balakrishna)విశ్వ ప్రదర్శన చేసిన అఖండ(akhanda) ఇప్పుడు ఈ మూవీనే  తమన్ ని వార్తల్లో నిలిచేలా చేసింది.

అఖండ లో బాలయ్య తన రెండు క్యారెక్టర్స్ లో ఎంతగా విజృంభించాడో, బోయపాటి ఎంత బాగా తెరకెక్కించాడో, అంతే ఇదిగా తమన్ మ్యూజిక్ ని అందించాడు.ప్రతి సీన్ కూడా తమన్ ఇచ్చిన  మ్యూజిక్ తో ఇంకో లెవల్ కి వెళ్ళింది.పైగా శివతత్వాన్ని జోడించిన సినిమా కావడంతో తమన్ ఆర్ ఆర్ కి థియేటర్స్ అన్ని శివ నామస్మరణతో ఊగిపోయాయి. పైగా చాలా థియేటర్స్ వాళ్ళు  ఆ బిజిఎం  కి తమ థియేటర్స్ ఎక్కడ పేలిపోతాయో అని సౌండ్ తగ్గించి ప్రదర్శన చేసారు. దీన్ని బట్టి అఖండ సునామీలో తమన్ చరిష్మా ని అర్ధం చేసుకోవచ్చు.పైగా తమన్  ఎంటైర్ కెరీర్ లో అఖండ నే బెస్ట్ మూవీ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అఖండ కి సీక్వెల్ గా అఖండ 2(akhanda 2)తెరకెక్కుతుంది. ఇటీవలే బిబి 4 గా అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. బి బి  4 అంటే బాలయ్య, బోయపాటి కాంబోలో నాలగవ సినిమా అని అర్ధం. ఇప్పుడు ఈ మూవీకి తమన్  వర్క్  చెయ్యటంలేదనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం బోయపాటి, తమన్ కాంబో లో రామ్ హీరోగా వచ్చిన స్కంద  అనే కారణాలు వినపడుతున్నాయి. ఆ టైం లో ఇద్దరి మధ్య  మనస్పర్థలు తలెత్తాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.

 

ఇక ఈ మ్యాటర్ మొత్తం సోషల్ మీడియాలో హైలెట్ కావడంతో చాలా మంది బాలయ్య ఫ్యాన్స్ తమన్ ఉంటేనే బాగుంటుందనే కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే  అఖండ లో తమన్ పూర్తిగా  లీనమయ్యాడు కాబట్టి పార్ట్ టూ కి కూడా ఉండాలని, ఈ విషయంపై బాలయ్య కల్పించుకోవాలని కూడా అంటున్నారు.ఇక  యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్  ఫిక్స్ అయ్యాడనే న్యూస్ అయితే బాగానే స్ప్రెడ్ అవుతుంది. 14 రీల్స్ పతాకంపై ఆచంట రామ్,  గోపీ లు అత్యంత భారీ వ్యయంతో  నిర్మిస్తున్నారు.  బిబి 4 అధికార లోగోలో మ్యూజిక్ డైరెక్టర్ పేరు అయితే ప్రచురించలేదు. 

 



Source link

Related posts

Weather In Telangana Andhrapradesh Hyderabad On 30 January 2024 Winter Updates Latest News Here | Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి, ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

Oknews

రేవ్ పార్టీ లో యాంకర్ రోహిణి ..ఏడుస్తున్న వీడియో వైరల్  

Oknews

CM Revanth expressed his anger at the negligence of electricity officials and staff | CM Revanth Reddy : కరెంట్ కట్ చేస్తే సస్పెండ్

Oknews

Leave a Comment