ఈ క్రమంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 307/1,2,3,4,5లో విస్తరించి ఉన్న అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫార్మ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని సిఐడి అటాచ్ చేసి దానిపై ఉన్న రుణాలను వసూలు చేసుకునే అధికారాన్ని యూనియన్ బ్యాంకుకు అప్పగించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు యూనియన్ బ్యాంకు రుణాలను మంజూరు చేసింది.