Andhra Pradesh

అజ‌య్ భూపతి కక్కలేక.. మింగలేక..! Great Andhra


ఇదియొక చిత్రమైన పరిస్థితి. హాఠాత్ పరిణామము. నిజ‌మో కాదో తెలియదు. సినిమా విడుదల చేసిన తరువాత కానీ పూర్తి వైనం తెలియదు. అలా అని ముందుగా తొందరపడితే అవతల వున్నది పెద్ద హీరో. మంచి పేరున్న హీరో. తన మాటలు నమ్ముతారో, నమ్మరో తెలియని వైనం. మొత్తం మీద ఇలాంటి పరిస్థితినే.. కక్క లేక.. మింగలేక అంటారేమో?

మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు అజ‌య్ భూపతిది ఇప్పుడు ఇదే పరిస్థితి. విషయం ఏమిటంటే కాస్త స్టామినా వుంది అని ప్రూవ్ చేసుకున్న ప్రతి దర్శకుడు ఎవరో ఒక హీరోకి కథ చెపుతూనే వుంటాడు. ఎక్కడో దగ్గర ఓ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనే నమ్మకంతో. అజ‌య్ భూపతి కూడా ఇలాగే చాలా మందికి చాలా కథలు చెప్పారు. హీరో ధనుష్ కు కూడా అలాగే ఓ కథ చెప్పారు. తరువాత ఏ సంగతీ చెపుతా అన్నారు థనుష్ కానీ ఏ సమాచారం రాలేదు.

అజ‌య్ భూపతి చెప్పినది.. కర్ణ అనే కథ. హీరోని తల్లి అనాధగా వదిలేస్తుంది. అతగాడికి మరో అనాధలు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి తోడవుతారు. అలా స్టార్ట్ అయ్యే కథ అది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే గ్యాంగ్ స్టర్ కథ.

ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల కాబోతోంది ధనుష్ రాయన్ సినిమా. చెన్నయ్ లోని ఓ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ఇందులో ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు ముగ్గురు. కథ ఏమిటీ అన్నది చాలా గుట్టుగా దాచారు. ఇందులో నటించిన సందీప్ కిషన్ కూడా నిన్న మీడియా మీట్ లో అదే చెప్పారు. కథను అస్సలు రివీల్ చేయవద్దని చెప్పారు అంటూ మీడియాకు చెప్పారు.

మొత్తం మీద సినిమా విడుదలైతే తప్ప అజ‌య్ భూపతి కథ నుంచి థనుష్ స్ఫూర్తి పొందారా? లేక దాన్నే మార్చేసి తీసారా? కాదు… ఇది పూర్తిగా కొత్త కథ అన్నది. కానీ తన కథే కనుక థనుష్ తీసేసుకున్నారు అని తెలిస్తే మాత్రం అజ‌య్ భూపతి అస్సలు ఊరుకునే రకం కాదు. వెంటనే మీడియా ముందుకు వచ్చినా వస్తారు.



Source link

Related posts

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ, చర్చలు సఫలం కాలేదంటున్న ప్రతినిధులు-amaravati news in telugu ap govt employees discussions with ministers committee on prc das ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Road Terror: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా…కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం… అనంతపురంలో దారుణం

Oknews

వ‌ర్క్ ప్లేస్ రొమాన్స్.. రైటేనా!

Oknews

Leave a Comment