EntertainmentLatest News

అజిత్ కి షాకింగ్ రెమ్యునరేషన్..ఇచ్చేది మన తెలుగు బడా నిర్మాత 


తమిళ అగ్ర హీరోలలో ఒకడు అజిత్ (ajith) ఒక్క చిటికేస్తే కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన వెంట నడుస్తారు. మూడు దశాబ్దాల తన సినీ కెరీర్లో  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.అవి చాలా వరకు  తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఆయనకి  సంబంధించిన లేటెస్ట్  న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా నిలిచింది.

అజిత్ ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ (Good Bad Ugly) అనే మూవీ చేస్తున్నాడు. అజిత్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో  నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్

నిర్మిస్తుంది. ఇందులో నటించినందుకు గాను  అజిత్  165 కోట్ల  రెమ్యునరేషన్ ని  డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మేకర్స్ కూడా ఆయన  అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో  వస్తుండటంతో వామ్మో అంత రెమ్యునరేషనా అని చాలా మంది  షాక్ అవుతున్నారు. అజిత్ ఫాన్స్ అయితే మా హీరో రేంజ్ కి ఇంకా అది తక్కువే అని అంటున్నారు.


తెలుగు ఇండస్ట్రీ లో కూడా అజిత్ రెమ్యునరేషన్ గురించి చర్చించుకుంటున్నారు.ఇక తలపతి విజయ్ తన నూతన చిత్రానికి 200 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు గతంలో వచ్చాయి. ఈ క్రమంలో అజిత్ రెమ్యునరేషన్ టాక్ అఫ్ ది తమిళ ఇండస్ట్రీగా మారింది. వాలీ, అమరకాలం ,ముగవారి, బిల్లా, మంగతా, దీనా, సిటిజెన్, వారలారు , ఆరంభం, ఆశై, వేదాళం, విశ్వాసం లాంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.  

 

 



Source link

Related posts

నా సామి రంగ.. నాగార్జున హిట్ కొట్టాడు

Oknews

విజయ్ కూతురు సూసైడ్ లెటర్ లభ్యం.. అందులో ఏముందంటే..

Oknews

200 కోట్లు సాధించిన మంజుమెల్ బాయ్స్..ఫస్ట్ మలయాళ మూవీ 

Oknews

Leave a Comment