Health Care

అటువైపు తిరిగి పడుకున్న యువతి.. శరీరంపై ఏదో పాకుతున్నట్లు అనిపించి లేచి చూడగా..!


దిశ, ఫీచర్స్ : ఈ మధ్య వింత సంఘటనలు, విచిత్ర వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. అది చూసిన వారు కూడా ఉత్సాహంతో రియాక్ట్ అవుతున్నారు. కొన్ని ఫన్నీగా ఉండటం, ఇంకొన్ని ఆసక్తి రేకెత్తించడం, మరికొన్ని భయానకంగా ఉండటం వంటి కారణాలతో అవి బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఓ వయుతి అటువైపు తిరిగి పడుకొని ఉండగా, మెల్లిగా ఓ ఆకారం ఆమెను సమీపించింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఆ యువతి శరీరంపై ఏదోపాకుతున్నట్లు అనిపించి దిగ్గున లేచి చూసే సరికి అసలు విషయం అర్థమైపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

మిగతా సీజన్లకంటే ప్రస్తుత వర్షాకాలంలో పాములు బయట ఎక్కువగా తిరుగుతుంటాయి. పుట్టలు, పొదలు వంటి తమ ఆవాసాలను వదిలి బహిరంగ మైదానాలు, చెట్లు, గడ్డి, రాళ్లు, ఇంటి పరిసరాలు వంటి జనావాసాల్లోకి వస్తుంటాయి. ప్రస్తుతం అదే జరిగింది. వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఓ యువతి నేలపై చాప వేసుకొని పడుకుంది. కాసేపటికే గాఢమైన నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పాము ఆమె దగ్గరకు వచ్చింది. మెల్లిగా శరీరంపై నుంచి మెడభాగంపైకి పాకుతూ వెళ్తోంది. నిద్రలో ఉన్న యువతికి ఏం జరిగిందో సరిగ్గా తెలియదు కానీ, మెడపై ఏదో ఆకారం పాకుతున్నట్లు అనిపించి ఒక్కసారిగా దిగ్గున లేచింది. తన మెడపై పాము పాకిందన్న విషయం గ్రహించి పరుగులు పెట్టింది. మొదట కంగారు పడిన యువతి, చివరికి ఆ పాము తనను కాటువేయలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలైతే లేవు కానీ, ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, పాములు, కీటకాలతో కాస్త జాగ్రత్త.. అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.





Source link

Related posts

ఎండలో వెళ్లొచ్చి చల్లని నీళ్లు తాగుతున్నారా? అలా చేస్తే ప్రాణం పోయినట్లే..!

Oknews

జంతువుల్లోనూ భావోద్వేగాలు.. ఆయా సందర్భాల్లో ఎలా ప్రదర్శిస్తాయంటే..

Oknews

దాదాపు 60 శాతం మంది భారతీయులు బద్ధకస్తులే…

Oknews

Leave a Comment