Health Care

అడోబ్స్ న్యూ AI ఆడియో టూల్స్.. ఇక ఆడియో, వీడియో ఎడిటింగ్‌ సరికొత్త గేమ్ ఛేంజర్ కావచ్చు..(వీడియో)


దిశ, ఫీచర్స్ : మల్టీమీడియా రంగంలో సాఫ్ట్‌వేర్లను అందించే బహుళజాతి సంస్థ అడోబ్ సిస్టమ్స్, అడోబ్ ప్రీమియర్ గురించి మనకు తెలిసిందే. పేజ్‌మేకర్, ఫొటోషాప్, అక్రోబాట్, ఫ్లాష్ లాంటి సాఫ్ట్‌వేర్లను అందించింది ఈ కంపెనీయే. అయితే తాజాగా ఇది ప్రీమియర్ ప్రో కోసం కొత్త ఆడియో టూల్స్‌ను ఆవిష్కరించింది. ఇవి వీడియో, ఆడియో ఎడిటింగ్‌లను గతంకంటే సులభతరం చేయనున్నాయి. సహజమైన జోడింపులలో ఇంటరాక్టివ్ ఫేడ్ హ్యాండిల్స్, AI-పవర్డ్ ఆడియో ట్యాగింగ్, అట్రాక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌ ఆడియోస్‌ను అతుకులు లేకుండా క్రియేట్ చేయడం కోసం AI- అసిస్టెడ్ సౌండ్ బ్యాలెన్సింగ్ కలిగి ఉన్నాయి.

ఈజీ వర్క్‌ఫ్లో

అడోబ్ ప్రీమియర్ ప్రో మోస్ట్ రీసెంట్ అప్‌డేట్స్ ఇప్పుడు అన్ని విధాలుగా AI ఇన్నోవేషన్‌ను స్వీకరించే ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు అడోబ్ ఏఐ పవర్డ్ ఆడియో ట్యాగింగ్ అనేది వర్క్‌ఫ్లోను మరింత సులభతరం చేయడంపై ఫోకస్ చేయబడింది. ఇది అప్డేట్ ‘హై- క్వాలిటీ’ ఆడియోతో వీడియోలను రూపొందించడానికి, తక్కువ క్లిక్‌లతో తమ ఫైనల్ మిక్స్ పొందడానికి ఎడిటర్లకు మంచి అవకాశం కల్పిస్తుంది.

ఫేడ్ హ్యాండిల్స్ కీ రోల్

ఇంటరాక్టివ్ ఫేడ్ హ్యాండిల్స్‌ను పరిచయం చేయడంవల్ల వినియోగదారులు ఆడియోకు ఫేడ్-ఇన్స్ అండ్ ఫేడ్-అవుట్స్‌లను అప్రయత్నంగా జోడించడానికి అడోబ్ న్యూ ఏఐ ఆడియో టూల్స్ అనుమతిస్తాయి. అంతేకాదు AI ఆడియో క్లిప్‌లను ఆటోమేటిక్‌గా లేబుల్‌చేసే వర్కును సులభతరం చేస్తుంది. డైలాగ్ అండ్ మ్యూజిక్ నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ యాంబియంట్ సౌండ్ వరకు అద్భుతంగా పనిచేస్తుంది. ట్రాక్ హైట్ మార్చబడినప్పుడు వేవ్‌ఫారమ్స్‌పై దాని సైజును మార్చడం ఇందులో మరొక స్మార్ట్ ఇన్నోవేషన్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది. న్యూ సెట్ ఆఫ్ కలర్స్‌తో జత చేయబడిన వేవ్‌ఫామ్స్ ఆహ్లాదకరంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

ఆటోమేటెడ్ క్లీనింగ్

ఏఐ న్యూ ఆడియో టూల్స్ ఎడిటింగ్ పర్పస్‌లో క్రియేటివిటీని ప్రదర్శించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాదు ఆడియో ఫైల్స్‌ను ఆటోమేటిక్‌గా క్లీన్‌చేసే మరికొన్ని ఏఐ టూల్ అండ్ ఎన్‌హాన్స్‌స్పీచ్ టూల్స్‌ను కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు అడోబ్ ప్రీమియర్ వెల్లడించింది. 2024 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ ప్రో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా నిరూపింబడిన సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుత అడోబ్ ఆడియో ఎడిటింగ్ అప్‌డేట్స్ ఫిల్మ్ మేకింగ్ భవిష్యత్తులో మరింత కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు.



Source link

Related posts

Amazon: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్..!

Oknews

విమానంలో వెళ్తే ఒక కాయను అస్సలే తీసుకెళ్లకూడదంట.. అది ఏమిటో మీకు తెలుసా?

Oknews

Types Of Salt: ఉప్పులో ఐదు రకాలు.. ఆరోగ్యంపై ఏది ఎలా ప్రభావం చూపుతుందంటే..!

Oknews

Leave a Comment