దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ప్రపంపచవ్యాప్తంగా ఎక్కవ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలో డయాబటీస్ ప్రధానమైనది. తినే తిండే, జీవిన శైలి కారణంగా చాలా మంది డయాబెటీస్ భారీన పడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య చాలా మందిని పట్టి పీడిస్తుంది. షుగర్ ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డయాబెటీస్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతుందని ఇప్పటికే పలు పరిశోధనలో తేలింది. ఈ క్రమంలోనే తాజా పరిశోధనలో మరో కొత్త కారణాలు వెలుగులోకి వచ్చాయి.
టైప్2 డయాబెటిస్‌కు బద్ధకంతో కూడిన జీవినశైలి ఓ కారణమని ఈ నివేదిక వెల్లడించింది. కొంత మంది ఎక్కువగా పిండి పదార్థాలు తినడం, అలాగే బద్దకంగా వ్యవహరించడం చేస్తుంటారు. ఈ కారణాల చేతనే శరీరంలో కొవ్వు పెరిగి డయాబెటీస్ ఎటాక్ అవుతుందట. దీంతో పాటు స్మోకింగ్ కూడా ఓ కారణమని చెబుతున్నారు. పొగాకుకు సంబంధించిన వాటిని వినియోగించడం ద్వారా షుగర్ పెరుగుతందట. అయితే.. ఈ రోజుల్లో జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు స్మోక్ చేసినట్లయితే.. కడుపులో బిడ్డకు కూడా డయాబెటీస్ ప్రభావం ఉంటుందట. కాగా.. బాల్యంలో లేదా యుక్తవయసులో సిగరెట్లు తాగటం మొదలెట్టిన వారికి పెద్దయ్యాక షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.