Health Care

అదో వెరైటీ గ్రామం.. ఈల వేస్తేనే అన్ని పనులు జరుగుతాయి


దిశ, ఫీచర్స్ : ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు చాలా విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఆసక్తి కలిగించే గ్రామం గురించి తెలుసుకుందాం. దాని పేరు మేఘాలయలోని కాంగ్ థాంగ్. దీన్ని విజల్ గ్రామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన దగ్గర సరదాగా విజిల్ వేస్తుంటారు. కానీ అక్కడి ప్రజలు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోకుండా, ఈలతోనే పిలుచుకుంటారు.

అంతే కాకుండా అక్కడ ఒక్కో ఇంటికి ఒక్కో రాగం‌తో ఈల వేస్తుంటారంట. పేరు కోసం ఒక విధంగా విజిల్ వేయడం, తల్లి తన బిడ్డకు ఇచ్చే రాగం కోసం లేదా కుటుంబంలో తమ వారిని పిలవడానికి ఇలా ఒకొక్కరి కోసం ఒక్కో రాగంతో ఈలలు వేస్తుంటారంట.ఆ గ్రామంలో విజిల్ వేయనిదే ఏ పని జరగదు అంటున్నారు అక్కడి వారు.

ఈ విజిల్స్ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి సృష్టించినవే. పుట్టిన తర్వాత, శిశువు చుట్టూ నివసించే వ్యక్తులు ఆ ట్యూన్‌ను నిరంతరం హమ్ చేస్తూ ఉంటారు. తద్వారా శిశువు ధ్వనిని బాగా గుర్తిస్తుంది.అయితే ఇలా విజిల్ వేసుకోవడానికి కూడా ఒక కారణం ఉన్నదంట. ఎందుకంటే? ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లినప్పుడు దొంగలు వారిపై దాడిచేశారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కి స్నేహితులను పిలవడానికి కొన్ని పదాలు ఉపయోగించాడంట,అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందంటున్నారు అక్కడి ప్రజలు.



Source link

Related posts

రెండు తలల అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు.. మూడేళ్లకు బయటపడ్డ టాప్ సీక్రెట్!

Oknews

ఈ టిప్స్ తో మైగ్రేన్ తలనొప్పి ఇట్టే మాయమవుతుంది.. ఒకసారి ట్రై చేయండి!

Oknews

ఈ తేదీల్లో జన్మించిన వారికి తిరుగులేదు.. ఏదైనా సాధించగలుగుతారు!

Oknews

Leave a Comment