పరారీలో మరో ఇద్దరు నిందితులుఇంటీరియర్ అయిన విజయ్ కుమార్ గతంలో అమెజాన్(Amazon) లో పని చేసిన కృష్ణా వంశీకి వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీ మీద పూర్తి పట్టు ఉండడంతో ప్లాన్ ప్రకారం చోరీలు చేసేవారు. అద్దెకు తీసుకొని కారును చోరీ చేయాలనుకునే ఇంటికి దూరంగా ఉంచి…ముందుగా రెక్కీ నిర్వహించిన ప్రకారం మిగతా ఇద్దరు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి డోర్ కట్టర్ తో లోక్ లు ఓపెన్ చేసి చోరీలు చేసే వారు. ఇలా కుషాయిగూడ, చర్లపల్లి ,జవనగర్ అల్వాల్ ప్రాంతాల్లో మొత్తం ఆరు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 21న అల్వాల్ పట్టణ పరిధిలో మచ్చ బొల్లారం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు……అనుమానస్పద స్థితిలో కారులో ప్రయాణిస్తున్న విజయ్ కుమార్, కృష్ణవంశీ సతీష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా ముఠా దొంగతనాలు బయటపడ్డాయని ఏసీపీ రాములు వివరించారు. దాదాపు 32 తులాల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి అబరణలు, ఒక లాప్ టాప్ తో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరి ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు తేజ, సుధాకర్ పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ నరసింహ పర్యవేక్షణలో అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ కేసును దర్యాప్తు చేశారు.
Source link