Health Care

అధిక కోపం, ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారా..? అయితే ఈ రూమ్‌కు వెళ్లాల్సిందే..!


దిశ, ఫీచర్స్: ప్రతీ మనిషికి కోపం అనేది సర్వ సాధారణం. ఇళ్లు, స్కూల్, కాలేజీ, ఆఫీస్ ఇలా ప్లేస్ ఏదైన సరే కొన్ని కారణాల చేత చాలా మంది కోపానికి, ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి సమయాల్లో కొంత మంది సైలెంట్‌గా ఉండేందుకు ఇష్టపడతారు. మరికొందరు మాత్రం భౌతిక దాడులకు కూడా దిగుతుంటారు. ఈ క్రమంలోనే తమ చేతిలోనే ఉండే వస్తువులను పగలగొట్టడం లేదా, తమకు తాము గాయపరుచుకోవడం వంటివి చేస్తారు. అయితే.. ఈ కారణంగా కొంత మంది వేరే వాళ్ల మీద కోపాలను వ్యక్త పరచలేక మెంటల్లీ చాలా సఫర్ అవుతారు. దీనిని తగ్గించే మార్గంగా నైజీరియాకు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వినూత్న నిర్ణం తీసుకున్నాడు.

తమ కోపంతో మెంటల్ ప్రెజర్ అనుభవిస్తున్నవారు దాని నుంచి విముక్తి పొందేందుకు ఇప్పుడు ఎక్స్‌ట్రాడినరీ చికిత్సను పొందవచ్చు. దీనికోసం బాంజోకో బాబాజీడే జేమ్స్, సహ వ్యవస్థాపకుడు అయిన సైకాలజిస్ట్ డాక్టర్ జేమ్స్ నైజీరియా వాణిజ్య రాజధాని అయిన లాగోస్‌లో ఎప్పుడు రద్ధీగా ఉండే మెగాసిటీలో ఉన్న షాడో‌లో ‘రేజ్ రూమ్’ అనే దానిని ఏర్పాటు చేశాడు. ఆ రూమ్‌లో టీవీలు, గాజు వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా చాలా ఉంటాయి. అధిక కోపంతో వచ్చిన వాళ్లను అందులోకి పంపిస్తారు. అక్కడ వాళ్లకు ఓ స్టిక్ ఇచ్చి వారి కోపం పోయేంత వరకు ఆ వస్తువులను పగల గొట్టమని చెప్తారు. ఇక వస్తువులను పగల గొట్టే సమయంలో వారికి ఏం కాకుండా ఉండేందుకు హెల్మెట్‌తో పాటు షూస్, ప్రత్యేకమైన దుస్తులు అందిస్తారు. అందులోకి వెళ్లేందుకు 7,500 నైరా ($8.93) పే చెయ్యాల్సి ఉంటోంది. ఇందుకోసం వారికి 20 నిమిషాల టైం ఉంటోంది.

అయితే.. నైజీరియాలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సంక్షోభం నుంచి ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. ఈ రూమ్ కారణంగా చాలా మంది తమ ఒత్తిడి, కోపం నుంచి విముక్తి చెందారని తెలుస్తోంది. ఇక ఈ ‘రేజ్ రూమ్’ను గతేడాది స్థాపించగా.. ప్రస్తుతం ఇది విజయవంతంగా రన్ అవుతోంది. ఈ విషయాన్ని ట్వీట్ రూపంలో తెలియజేశారు. అందులో ఈ రేజ్ రూమ్ కారణంగా విముక్తి పొందిన చాలా మంది వ్యక్తులు మాట్లాడారు. వాళ్లకు ఈ రేజ్ రూమ్ ఎలా ఉపయోగపడిందో వివరించారు. కాగా.. ఈ గదికి మంచి ఆదరణ లభించినప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ భావనను అర్థం చేసుకోలేదని జేమ్స్ అంగీకరించాడు.

ఇదిలా ఉంటే.. సూరజ్ పూసర్త (25) అనే యువకుడు హైదరాబాద్‌లో కూడా ఇలాంటి రేజ్ రూంను ప్రారంభించాడు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే మాదాపూర్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కోపం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వస్తువులను పగలగొట్టి ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెబుతున్నాడు. అయితే అతడు కూడా దీనికి కొంత పేమెంట్‌ను ఫిక్స్ చేశాడు.



Source link

Related posts

NEET UG పరీక్ష 2024 : NTA NEET పరీక్షకు ఇలా దరఖాస్తు చేసుకోండి..

Oknews

ఆఫీస్ వర్క్స్ చేస్తున్నారా.. అయితే గుండెపోటు వచ్చే ప్రమాదముంది!!

Oknews

కేవలం ఒకటి రెండు రోజులే పీరియడ్స్ అవుతున్నాయా!.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

Oknews

Leave a Comment