Health Care

అనంత్ అంబానీ ఫిట్నెస్ ట్రైనర్ నెల జీతం ఏంతో తెలిస్తే ఫీజులౌట్


దిశ, ఫీచర్స్: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండింగ్‌లో ఉంటుంది. వారు ఉపయోగించే కార్ల దగ్గరి నుంచి వంట చేసే పనివారు, డ్రైవర్ల జీతాలు, మేకప్ మ్యాన్స్, వాళ్లు తినే ఫుడ్, కట్టుకునే బట్టలు, వేసుకునే నగలు ఇలా ప్రతి ఒక్కటి వారికి సంబంధించిన విషయాలు నెట్టింట హైలెట్ అవుతుంటాయి.

అయితే తాజాగా ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఫిట్నెస్ ట్రైనర్ నెల జీతం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. అనంత్ అంబానీ ఎంత లావుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అనంత్ అంబానీ గతంలో ఒక్కసారిగా 108 కిలోలు తగ్గారు. దీంతో జనాలందరూ షాక్ అయ్యారు. తర్వాత మళ్లీ సడన్ గా వెయిట్ పెరిగారు. అకస్మాత్తుగా బరువు తగ్గడం అండ్ పెరగడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది.

అయితే అనంత్ ఫిట్నెస్ ట్రైనర్ అయిన వినోద్ చన్నా ఇచ్చిన కఠిన వ్యాయామాల వల్లే బరువు తగ్గాడని సమాచారం. కఠినమైన ఆహారం నియమాలను పెట్టి కష్టమైన వ్యాయామాలు చేయించి కేవలం 18 నెలల్లోనే 108 కిలోల వెయిట్ తగ్గేలా చేశాడట. అయితే వినోద్ చన్నా 12 సెషన్స్‌కు ఏకంగా రూ. 1.5 లక్షలు తీసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. గతంలో పర్సనల్ ట్రైనింగ్ కోసం దాదాపు రూ. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట.

ఇకపోతే రీసెంట్ గా అనంత్ అంబానీకి రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 12 వ తేదీన వీరి వివాహం జరగనుంది. మార్చి 2 నుంచి 3 తారీకు వరకు గుజరాత్ తోని జామ్ నగర్ లో వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌కు చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ పాల్గొనబోతున్నారని సమాచారం.



Source link

Related posts

రెండు తలల అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు.. మూడేళ్లకు బయటపడ్డ టాప్ సీక్రెట్!

Oknews

వారెవ్వా మినీ గోవా.. జీవితంలో ఒక్కసారైనా ఈ ట్రిప్ వేయాల్సిందే..

Oknews

మసాలా ఇడ్లీలు ఎప్పుడైనా విన్నారా .. ఎలా తయారు చేసుకోవాలంటే?

Oknews

Leave a Comment