GossipsLatest News

అనిల్ రావిపూడి నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్


భగవంత్ కేసరి తో హిట్ కొట్టాక అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. కామెడీ ఎంటెర్టైనెర్స్ నుంచి భగవంత్ కేసరి లాంటి సీరియస్ నెస్ సినిమాతో జోనర్ మార్చడంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమాని ఏ హీరోతో మొదలు పెడతాడో, ఏ జోనర్ ని సెలెక్ట్ చేసుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే సైలెంట్ గా నెక్స్ట్ సినిమా కి కథని సిద్ధం చేసుకుంటున్న అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి మరోసారి సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. అది కూడా హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వెంటేష్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. మరి వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3 తో మంచి కామెడీ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించి పట్టాలెక్కించే ప్లాన్ లో అనిల్ రావిపూడి ఉన్నాడు అని సమాచారం. 



Source link

Related posts

సిద్ధార్థకు క్షమాపణ చెప్పిన స్టార్‌ హీరో!

Oknews

Minister Komatireddy Praises Prabhas Kalki 2898 AD కల్కి ని వీక్షించిన కోమటి రెడ్డి

Oknews

ఇంకెన్ని సార్లు ఢిల్లీకి బాబు.. తెలేదెప్పుడు..!

Oknews

Leave a Comment