Top Stories

అన్నీ సంక్రాంతికే.. సగటు బయ్యర్ ఆవేదన ఇది


తమ ఫేవరెట్ హీరో సినిమా సంక్రాంతికి వస్తుందంటే అభిమానుల ఆనందం వేరు. ఇది పైకి కనిపిస్తుంది. మరి నిర్మాతలకు ఎందుకు అంత ఆనందం. తమ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనే కసి/తాపత్రయం/ఆవేశం ఎందుకు? సదరు హీరోను ప్రసన్నం చేసుకునేందుకా? పైకి ఈ ఆన్సర్ చెప్పుకోడానికి బాగుంటుంది. కానీ తెరవెనక అసలు మేటర్ ఏ బయ్యర్/ఎగ్జిబిటర్ ను అడిగినా చెబుతాడు.

మామూలు రేటు వేరు.. సంక్రాంతి రేటు వేరు..

ఓ సినిమా బిజినెస్ హీరో మార్కెట్ పై నడుస్తుంది. అదే మార్కెట్ కు సంక్రాంతి సీజన్ కూడా యాడ్ అయితే బిజినెస్ కనీసం 30శాతం పెరుగుతుంది. ఇది బహిరంగ రహస్యం. సంక్రాంతి సీజన్ లో అంతా థియేటర్లకు క్యూ కడతారు. కొత్త సినిమాలు చూడాలనుకుంటారు. పండగలో సినిమా ఓ భాగం అయిపోయింది. దీన్ని సినీ జనాలు క్యాష్ చేసుకోవడం అనాదిగా ఆనవాయితీగా మారింది.

మరి ఇక్కడ లాభపడుతోంది ఎవరు? దీనికి సమాధానం సినిమా సినిమాకు మారిపోతుంది. అల్టిమేట్ గా ఆనందపడేది మాత్రం నిర్మాతే. సంక్రాంతి సీజన్ పేరిట, ప్రీ-రిలీజ్ బిజినెస్ రేట్లను 30 శాతం పెంచి అమ్ముకుంటారు. స్టార్ హీరోలకైతే ఈ మార్జిన్ 50 శాతానికి కూడా చేరిపోతుంది.

ఉదాహరణకు పవన్ కల్యాణ్ సినిమానే తీసుకుంటే, అతడు నటించిన బ్రో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇదే సినిమా సంక్రాంతికి రిలీజైనట్టయితే రేటు కనీసం 100-120 కోట్ల రూపాయలకు చేరి ఉండేది. వసూళ్లు, బ్రేక్ ఈవెన్ సంగతి దేవుడెరుగు.

సంక్రాంతి కార్డు వాడేది అందుకే..?

తమ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అనేది నిర్మాతకు అప్రస్తుతం. ఇంకా చెప్పాలంటే అది అతడి చేతిలో లేని అంశం. గ్రాఫిక్స్ లేట్ అవ్వొచ్చు, షూటింగ్ కంప్లీట్ కాకపోవచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. కానీ ప్రొడ్యూసర్ మాత్రం తన సినిమా సంక్రాంతికే వస్తుందని చెబుతాడు. అవసరమైతే డేట్ వేసి మరీ పోస్టర్ రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే, ప్రీ-రిలీజ్ బిజినెస్ జోరుగా సాగడంతో పాటు, కాస్త ఎక్కువ మొత్తాలు వస్తాయి కాబట్టి.

ఒకప్పుడు సంక్రాంతి సినిమాల ఎనౌన్స్ మెంట్లు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల నుంచి మొదలయ్యేవి. కానీ ఇప్పుడు ఓ సంక్రాంతి ముగిసిన వెంటనే, నెల రోజులు గ్యాప్ ఇచ్చి, వచ్చే సంక్రాంతికి డేట్స్ వేసి బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు నిర్మాతలు. సినిమా సంక్రాంతికి వస్తే ఓకే. రాకపోతే, కట్టిన ఎక్స్ ట్రా డబ్బులు మాత్రం బయ్యర్ కు వెనక్కు వెళ్లదు. "నెక్ట్స్ సినిమాకు చూసుకుందాం" అనే కామన్ డైలాగ్ నిర్మాత నుంచి వినిపిస్తుంది.

అలా అదనపు రేట్లు పెట్టి కొన్న సినిమా సంక్రాంతి బరిలోకి వచ్చి ఫ్లాప్ అయితే నష్టపోయేది బయ్యరే. అసలు సంక్రాంతి సీజన్ లోకి రాకుండా తప్పుకున్నా నష్టపోయేది బయ్యరే. ఈ రెండు కేసుల్లో నిర్మాత-హీరో ఇద్దరూ సేఫ్. మధ్యలో ఫ్యాన్స్ హడావుడి కొసమెరుపు.



Source link

Related posts

‘జమిలి’ అటకెక్కినట్లేనా?

Oknews

ఈ దె…భాష ఏంటి అయ్యన్నా…!?

Oknews

చినబాబు మాయమాటలకు ఇదే పెద్ద రుజువు!

Oknews

Leave a Comment