విజయ్ కొత్త సినిమా నుంచి అతడి లుక్ ఈమధ్య లీక్ అయిన సంగతి తెలిసిందే.. ఆ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది యూనిట్. త్వరలోనే అఫీషియల్ గా లుక్ రిలీజ్ చేస్తామని, లీకైన ఫొటోను ఎవ్వరూ షేర్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది.
ఇప్పుడీ సినిమా నుంచి మేకర్స్ అధికారికంగా స్టిల్ రిలీజ్ చేశారు. అప్పుడు లీకైన ఫొటోలో విజయ్ ఏ గెటప్ లో ఉన్నాడో, అదే గెటప్ తో ఓ స్టిల్ రిలీజ్ చేశారు. పనిలోపనిగా విడుదల తేదీని ప్రకటించారు.
సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది మార్చి 28న విజయ్ కొత్త సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెల్లోనే టైటిల్ ను ప్రకటిస్తామన్నారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఇందులో విజయ్ 4-5 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడు మరో లుక్ బయటకొస్తుందేమో చూడాలి.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా శ్రీలంక షెడ్యూల్ పూర్తిచేశారు. దీంతో సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది.
The post అప్పుడు లీకైంది.. ఇప్పుడు ప్రకటన వచ్చింది appeared first on Great Andhra.