EntertainmentLatest News

అఫీషియల్.. సలార్ కొత్త రిలీజ్ డేట్.. షారుఖ్ కి సవాల్!


సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న ‘సలార్’ మొదటి భాగం కొత్త విడుదల తేదీ వచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే సంక్రాంతికి ఉండే అవకాశముందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 22 డేట్ ఫిక్స్ అని వినిపించింది. అందుకు తగ్గట్టుగానే సలార్ మొదటి భాగాన్ని డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ వదిలారు. ఒంటినిండా నెత్తుటి మరకలతో కత్తి పట్టుకొని ఉన్న ప్రభాస్ పోస్టర్ అదిరిపోయింది.

కాగా డిసెంబర్ 22న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘డుంకి’ కూడా విడుదల కానుంది. మరి ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.



Source link

Related posts

తెలుగు సినిమాలో విలన్ గా స్టార్ క్రికెటర్ 

Oknews

ఈ వారం ఓటీటీలో 24 సినిమాలు రిలీజ్‌!

Oknews

ప్రభాస్ కోసం సీఎం, డిప్యూటీ సీఎం!

Oknews

Leave a Comment