Health Care

అమృతంతో సమానం అయిన ఈ పండుని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


దిశ, ఫీచర్స్: ఆప్రికాట్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎండిన ఆప్రికాట్ల రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఆప్రికాట్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో, అనేక వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. దీంతో శరీరానికి సమృద్ధిగా పోషకాలు అందుతాయి. ఆప్రికాట్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. కెరోటినాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ ఎండిన ఆప్రికాట్‌లలో కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండు తినడం వల్ల ఏయే వ్యాధులను చెక్ పెట్టోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

*ఆప్రికాట్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని మెరుగుపరచడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మలబద్దకంతో బాధపడుతున్నవారు ఈ పండు తినడం చాలా మంచిది.

* అదేవిధంగా ఆఫ్రికాట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది.

* ఆప్రికాట్‌లోని ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గాలనుకునే వారు కూడా ఆప్రికాట్ తినొచ్చు.

*ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం, ఐరన్, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఆవశ్యక మూలాలు ఆప్రికాట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* అలాగే ఆప్రికాట్లలో రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంచి అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తాయి.

*వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

*అదేవిధంగా శరీరానికి వేడి నుంచి ఉపశమనం అందించే లక్షణాలు ఉన్నాయి.

*అలాగే ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు వాపు, నొప్పి వంటి వాటిని తగ్గిస్తాయి.

*ఆప్రికాట్లలో విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి.

*క్యాన్సర్ నివారిణిగా సహాయపడే కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆప్రికాట్లలో అధికంగా ఉన్నాయి.

క్రమం తప్పకుండా ఆప్రికాట్లు తినడం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

మొక్క జొన్నలో అద్భుత పోషకాలు.. తినడంవల్ల కలిగే లాభాలివే..

Oknews

హోలీ రోజునే తొలి చంద్ర గ్రహణం.. గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి

Oknews

viral : ఓర్నీ.. పెళ్లైన మూడు నిమిషాలకే అదేం పని.. ఒక్కరోజు కూడా ఆగలేకపోయారా!

Oknews

Leave a Comment