GossipsLatest News

అయ్యో.. కేసీఆర్ ఒంటరి అవుతున్నారే..?


అయ్యో సారు కారుకు ఎన్ని కష్టాలో..!!

ప్రత్యేక తెలంగాణ సాధించిన, రాష్ట్ర జాతిపితగా పేరు సంపాదించుకున్న కేసీఆర్‌కు.. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న కారు పార్టీకి ఇప్పుడు అడుగడుగునా స్పీడ్ బ్రేకులు పడుతున్నాయ్. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా..? హుష్ అని ఎగురుతుందా..? అనే విషయం తెలియక గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పరువు అయినా నిలుపుకుందాం అని విశ్వప్రయత్నాలు చేస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులు కారు పార్టీని కుదేలు చేస్తున్నాయి. అయ్యో.. రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్‌కు.. రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి రావడమేంటి..? అని అగ్రనేతనేతలు, క్యాడర్ ఆలోచనలో పడింది.

ఏం జరుగుతోంది..?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా  రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. అదేదో అంటారో అధికారం లేకపోతే అల్లకల్లోల్లమే అన్నట్లుగా.. కారు పార్టీ  తయారైంది. కేసీఆర్ నాయకత్వంలో తిరుగులేకుండా  పదేళ్లపాటు అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్.. జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పాలని భావించిన పార్టీ.. ఒక్కసారిగా బొక్కా బోర్లా పడిపోయింది. ఎన్నికల్లో ఓటమితో ‘కారు’లో గాలి తగ్గడం మొదలై.. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతలు, అత్యంత సన్నిహితులు, ఆప్తులు, ఆత్మీయులు.. కేసీఆర్‌కు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్నోళ్లు ఒక్కొక్కరుగా కారు పూర్తిగా పంచరైపోతోంది. పేరుగాంచిన నేతలు ఎవరైనా ఉన్నారా అని వేళ్లతో లెక్కెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. సిట్టింగులు, ముఖ్యనేతలు, అగ్రనేతలు సైతం పార్టీని వీడటంతో గులాబీ పార్టీకి గడ్డుకాలం వచ్చినట్లయ్యింది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన వారు సైతం అబ్బే మాకొద్దు మీ టికెట్ అని కారు దిగిపోతుండటం మరో ఎత్తు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కేసీఆర్ ఒంటిరి అవుతున్నాడేమో అని సదరు పార్టీ కార్యకర్త భావిస్తున్న పరిస్థితి.

చేజేతులారా చేసుకున్నదేనా..?

అటు జంపింగ్‌లు.. ఇటు కవిత అరెస్ట్.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలతో కారు పార్టీలో కంగారే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే.. బీఆర్ఎస్ ఈ పరిస్థితికి రావడానికి మాత్రం కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని.. 2019 లో గెలిచాక కాంగ్రెస్‌ను బాస్ ఎలా ఖాళీ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు ఈ రెండు పార్టీలను నామరూపాల్లేకుండా చేసిన గులాబీ బాస్‌కు.. సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు ఏ గతి పట్టించారో.. అదే గతి ఇప్పుడు  కేసీఆర్ పార్టీకి పట్టిందని విశ్లేషకులు, మేథావులు చెబుతున్న మాట. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. పార్టీ పరిస్థితి ఏమవుతుందో.. పరువు కాపాడుకోవడానికి సారు చేసే దిద్దుబాటు చర్యలేంటో వేచి చూడాలి మరి.



Source link

Related posts

వెయ్యి మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై ప్రభాస్ తల్లి కీలక వ్యాఖ్యలు

Oknews

మహిళాశక్తి పథకం కోసం శిల్పారామం స్టాల్స్.!

Oknews

Crores spent for crucial scene in Pushpa 2 పుష్ప2 లో ఆ సీన్ కి థియేటర్స్ బ్లాస్ట్

Oknews

Leave a Comment