Entertainment

అరుదైన ఘనత సాధించిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైమొచ్చింది!


జూనియర్ ఎన్టీఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ది అకాడమీ(ఆస్కార్స్) యొక్క యాక్టర్స్ బ్రాంచ్ లో స్థానం సంపాదించుకున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటాడని ఇంటర్నేషనల్ మీడియా సైతం అభిప్రాయపడింది. అయితే ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనప్పటికీ.. తన నటనతో హాలీవుడ్ ప్రముఖులతో పాటు అకాడమీ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. తాజాగా ఆస్కార్స్ ‘న్యూ మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’ అంటూ ఐదుగురు నటుల పేర్లు ప్రకటించింది. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఎన్టీఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం పట్ల ప్రశంసలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్ లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్కార్ నామినేషన్ తుది జాబితాకు ముందు.. ఆస్కార్ నామినేషన్ల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన నటులు మాత్రమే అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌కు అర్హులు అని సమాచారం. దీనిని బట్టి చూస్తే ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్స్ తుది జాబితాలో ఎన్టీఆర్ పేరు లేనప్పటికీ.. నామినేషన్ల కోసం షార్ట్‌లిస్ట్ అయినవారిలో ఆయన ఉన్నాడని అర్థమవుతోంది.



Source link

Related posts

ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌ అదేనట.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!

Oknews

Ram Charan releases Ramaraju for Bheem teaser

Oknews

యూట్యూబ్ లో బాలయ్య మూవీ..ఇది వాళ్ళ పనే  

Oknews

Leave a Comment