Top Stories

అరెస్ట్ అంటే అనారోగ్యమే.. ?


మీడియా ముందు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోవడం ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడడం, పోలీసులు వచ్చేసరికి చుట్టూ పార్టీ వారిని అడ్డం పెట్టుకుని యాగీ చేయడం తమ్ముళ్లకే చెల్లింది అంటున్నారు. నాలుగు రోజుల క్రితం మహిళా మంత్రి ఆర్కే రోజా మీద అసభ్య అనుచిత పదజాలంతో దుర్భాషలు ఆడిన మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు వెళ్లేసరికి సీన్ మొత్తం మారిపోయింది.

బండారు ఇంటి చుట్టూ టీడీపీ కార్యకర్తలు మోహరించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సహా టీడీపీ ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా అక్కడికి వచ్చారు. బండారు అరెస్ట్ ని ఎలా అడ్డుకోవాలో అంతా టీడీపీ తమ్ముళ్ళు చేస్తున్నారు.

ఇంతలో బండారు కి అనారోగ్యంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనను అర్జంటుగా ఆసుపత్రిలో చేర్చాలని కుటుంబ సభ్యులు అంటున్నారు. బండారు వయసులో పెద్దవారే. ఆయనకు ఆరోగ్య ఇబ్బందులు లేవని ఎవరూ అనడంలేదు. కానీ పోలీసులు అరెస్టులు అన్న వేళ మాత్రమే ఇలా అనడం పట్లనే అంతా ఆలోచిస్తున్నారు.

బండారు ఆవేశంలో అనాల్సినవి అన్నీ అనేశారు, ఇపుడు అరెస్ట్ అంటే తమ్ముళ్లు అంతా ఆయనకు మద్దతుగా రావడమేంటి అని వైసీపీ నేతలు అంటున్నారు. బండారు అన్నది తప్పు అని ముందే చెప్పి తమ్ముళ్ళు ఆయన చేత క్షమాపణలు చెప్పించి ఉంటే అరెస్టుల దాకా వ్యవహారం వచ్చేది కాదు కదా అని అంటున్నారు. 

మీడియా ముందు హద్దులు లేకుండా చెలరేగిపోవడం పోలీసులను చూసిన తరువాత సాకులు చెప్పడం ముందస్తు బెయిల్స్ తెచ్చుకోవడం ఇదే నాలుగున్నరేళ్ళుగా తమ్ముళ్ళు చేస్తున్న పోరాటం అని వైసీపీ ఎకసెక్కమాడుతోంది. బండారు ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఆయన ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలని, మహిళా లోకం సహా యువత అంతా ఆయన చెప్పే మంచి మాటలు వినేలా ఆయన ప్రసంగాలు ఉండాలని విజ్ఞులైన వారు అంతా కోరుకుంటున్నారు.



Source link

Related posts

మన్యం మహిళా రైతుకు వైఎస్సార్ అవార్డు

Oknews

చంద్రబాబు ఆరోగ్యంపై అర్థంలేని విలాపాలు!

Oknews

‘మెగా’ పద్మ విభూషణుడు..మన ‘చిరు’

Oknews

Leave a Comment