కోలీవుడ్ లో ఒకప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర పని చేసిన ఫ్రీలాన్స్ మేనేజర్ అదిలింగం డ్రగ్స్ కేసులో పోలీసులకి పట్టుబడిన సందర్భంలో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ విచారణకు హాజరవ్వాలని టాక్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో నడిచింది. ఆ తర్వాత ఆమె నాకు ఈకేసులో ఎలాంటి సంబంధం లేదు, అతను నా దగ్గర ఎప్పుడో పని చేసాడు, ఇప్పుడు అతనికి నా ఆఫీసులోకి ఎంట్రీ కూడా లేదు అంది.
మళ్ళీ తాజాగా వలక్ష్మి శరత్ కుమార్ కి నార్కోటిక్ పోలీసులు సమన్లు జారీ చేసారు, ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరగడమే కాదు, ఆమెని అరెస్ట్ చేసినా చెయ్యొచ్చనే వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. దానితో మరోసారి వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్ అయ్యింది. మమ్మల్ని నటులుగా గుర్తించకపోయినా పర్లేదు, కానీ మమ్మల్ని కించపరిచేలా వార్తలు రాయొద్దు. ఈ మీడియాకి నేను తప్ప ఎవరూ దొరకడం లేదా.. మళ్ళీ పాత ఫేక్ న్యూస్ నే ప్రచారం చేస్తున్నారు.
మేము సెలబ్రిటీస్ గా నటిస్తాం, నవ్విస్తాం, ఎంటర్టైన్ చేస్తాం, మాలో లొసుగులు వెతకడం మానేసి మీ పని మీరు చెయ్యండి, ప్రపంచంలో ఇంకా చాలా పెద్ద సమస్యలున్నాయి. వాటిపై ఫోకస్ చెయ్యండి, మాపై ఫోకస్ తగ్గించండి. మా సైలెన్స్ ని చేతకాని తనంగా చూడొద్దు. కాబట్టి నిజమైన జర్నలిజాన్ని బయటికి తియ్యండి అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఫైరవుతుంది.
అన్నట్టు వరలక్ష్మి శరత్ కుమార్ ఈమధ్యనే ప్రియుడు, వ్యాపారవేత్త నీకొలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతుంది.