Health Care

అలాంటి ఉపవాసం ప్రమాదకరం.. ఇంటర్‌ ‌మిటెంట్ ఫాస్టింగ్‌‌‌పై అధ్యయనంలో షాకింగ్ విషయాలు !


దిశ, ఫీచర్స్ : ఇటీవల ఇంటర్‌‌మిటెంట్ ఉపవాసం ఎంతో ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా ఈ 16 :8 విధానం ప్రధాన ఉద్దేశం రోజులో 16 గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచుకోవడం, ఎనిమిది గంటల పాటు తినడం. ఇలా అప్పుడప్పుడూ పది రోజులో, నెల రోజులో ఉండటంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తారు. గత అధ్యయనాలు కూడా అదే పేర్కొన్నాయి. పైగా ఈ ఉపవాసం వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని వెల్లడించాయి. కానీ ప్రస్తుతం ఒక కొత్త అధ్యయనం మాత్రం అందుకు భిన్నమైన వాదనను ముందుకు తెచ్చింది.

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వ్యక్తులు, దానిని పాటించని వారితో తోపోల్చితే హృదయ సంబంధ వ్యాధులతో మరణించే అవకాశం 91 శాతం ఎక్కువగా ఉందని చికాగోలోని ఈపీఐ లైఫ్‌స్టైల్ సైంటిఫిక్ సెషన్‌లో పాల్గొన్న పరిశోధకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వీరు ఒక సమయ నియంత్రణ వ్యూహంతో కూడిన నివేదికను కూడా రూపొందించారట. 16 : 8 ఉపవాసం బరువు తగ్గడం, మెరుగైన కొలెస్ట్రాల్ లెవల్స్ నిర్వహణకు, జీవక్రియకు మేలు చేసేదిగా ప్రజాదరణ పొందింది. కానీ వాస్తవానికి అది ప్రమాదకరం అని నిపుణులు పేర్కొన్నారు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 2003 నుంచి 2018 వరకు యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే ద్వారా 20 వేలమంది పెద్దలతో కూడిన సమూహం నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈ ఇంటర్ మిటెంట్ ఉపవాస నియమాన్ని పాటించని వారితో పోలిస్తే, 16:8 పద్ధతిలో దీనిని పాటించే వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధులతో మరణించే అవకాశం 91 శాతం ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా వారు కనుగొన్నారు. 8 నుంచి 10 గంటల వ్యవధిలో తమ క్యాలరీలన్నింటినీ వినియోగించేవారికి వారు సాధారణంగానే గుండె జబ్బులు, స్ట్రోక్‌తో మరణించే ప్రమాదం 66 శాతం ఎక్కువగా ఉందని, క్యాన్సర్ బారిన పడే చాన్స్ కూడా ఉంటుందని గుర్తించారు. తమ అధ్యయనం, పరిశోధన సరైనదని భావిస్తున్నప్పటికీ  మరోసారి లోతైన అంశాలపై రివ్యూ చేయలేదు కాబట్టి  ప్రజలకు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్‌పై ఇప్పుడు సూచనలు మాత్రం చేయడం లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. 



Source link

Related posts

విటమిన్ డి అతిగా తీసుకుంటే.. ఆ సమస్యలు తప్పవు!

Oknews

ట్రెండ్‌ అవుతున్న ఆరెంజ్ టీ.. ఎలా తయారు చేసుకోవాలంటే..?

Oknews

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారట..

Oknews

Leave a Comment