EntertainmentLatest News

అల్లు అర్జున్ పై నాని సంచలన కామెంట్స్ అందుకు నాంది పలకనుందా!


నాచురల్ స్టార్ నాని(nani)హీరో నుంచి స్టార్ హీరోగా మారి తన కంటూ కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. పైగా  అందరి హీరోల అభిమానులు  నాని ని అభిమానిస్తారనే నానుడి కూడా  ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. నాని  తాజాగా అల్లు అర్జున్(allu arjun)ఉరఫ్ బన్నీ కి ఒక రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు అది ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.మరి అదేంటో చూద్దాం.

తాజాగా అన్ని భాషలకి చెందిన సినీ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన  69 వ ఫిలిం ఫేర్  అవార్డుల కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు  పాల్గొనడంతో ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఇక  దసరా(dasara)చిత్రంకి గాను నాని  బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నాడు. దీంతో పలువురు  సినీ ప్రముఖుల నుంచి నానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్లల్లో బన్నీ కూడా చేరాడు. చాలా స్టైలిస్ట్ గా..  కంగ్రాట్స్, వెల్ డిజర్వుడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా  తెలియచేసాడు.ఇప్పుడు  బన్నీ కి థాంక్స్ తెలుపుతు నాని కూడా నాచురల్ గా అంతే స్థాయిలో  ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. 

థాంక్యూ బన్నీ, ది రూల్ వ్యక్తి చాలా అవార్డులను తీసుకుంటాడని వెల్లడి చేసాడు. ఇప్పుడు ఈ  మ్యాటరే ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే ది రూల్ అనే క్యాప్షన్ బన్నీ పుష్ప(pushpa)రెండవ భాగానికి టాగ్ లైన్. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా  అర్ధాలు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరు బడా హీరోలు ఇలా వైరెటీ గా ట్వీట్ లు చేసుకుంటుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి. ఇద్దరి కాంబోలో సినిమా రావాలని ఆశపడతారు కదా!  ది రూల్ అంటే మాత్రం శాసించేవాడు అని అర్ధం. 



Source link

Related posts

రీ రిలీజ్ అవుతున్న క్లాసిక్ ఫిల్మ్!

Oknews

ఈ వారం చిన్న సినిమాలదే హవా.. అర డజను సినిమాల్లో ఆడియన్స్ ఓటు దేనికో!

Oknews

Rajinikanth Emotional Letter To Fans Understand me Don’t bother me with worries

Oknews

Leave a Comment