EntertainmentLatest News

అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ.. అసలు మేటర్ చెప్పేసిన బన్నీ వాసు!


‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇటీవల ప్రచారం జరిగింది. పలుసార్లు చివరి నిమిషంలో షూట్ ని క్యాన్సిల్ చేయడంతో.. సుకుమార్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న బన్నీ.. గడ్డం ట్రిమ్ చేశాడని న్యూస్ వినిపించాయి. ఇద్దరి మధ్య ఇదే దూరం కొనసాగితే, ఆ ప్రభావం షూట్ పై పడి.. డిసెంబర్ లో విడుదల కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఈ ఇష్యూపై అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు స్పందించాడు.

నార్నే నితిన్ హీరోగా బన్నీ వాసు (Bunny Vasu) నిర్మిస్తున్న ‘ఆయ్’ (Aay) మూవీ థీమ్ సాంగ్ లాంచ్ వేడుక తాజాగా జరిగింది. ఈ సందర్భంగా మీడియా నుంచి పుష్ప 2 వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పుష్ప 2 వివాదం అంటూ వస్తున్న వార్తలు చూసి మేము నవ్వుకున్నాం. పైగా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని హ్యాపీగా ఫీలయ్యాం. బన్నీ గారు ఇంకా క్లైమాక్స్, ఒక సాంగ్ మాత్రమే చేయాల్సి ఉంది. ఇంకో 15 రోజులే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సుకుమార్ గారి ఆలోచన ఏంటంటే.. ముందు ఎడిటింగ్ పూర్తి చేసి, ఏమైనా లింక్ లు మిస్ అవుతున్నాయా చూసుకొని.. అప్పుడు క్లైమాక్స్, సాంగ్ షూట్ చేయాలి అనుకున్నారు. దీనికి నెల రోజులు పైగా టైం పడుతుంది. అందుకే బన్నీ గారు గడ్డం ట్రిమ్ చేసుకున్నారు. దానిని పట్టుకొని ఇలా రాసేశారు. బన్నీ గారికి, సుకుమార్ గారికి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. సుకుమార్ గారు ఇంకో ఆరు నెలలు షూట్ చేస్తాను అని చెప్పినా.. బన్నీ గారు వెళ్తారు. వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవు.” అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.



Source link

Related posts

Pooja Hedge shared a story about her knee injuries బుట్టబొమ్మ కాలికి దెబ్బలు

Oknews

Telangana Assembly Election 2023 Komati Reddy Rajagopal Reddy Joined The Congress

Oknews

మెగాస్టార్ సినిమాకి ఎందుకు నో చెప్పానంటే…

Oknews

Leave a Comment