హీరోలకి అభిమానులే బలం. ఒక రకంగా అభిమాని లేనిదే హీరో లేడని కూడా చెప్పుకోవచ్చు. ఇందుకు రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas)అతీతుడేమి కాదు. ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలుసు. కానీ ఇప్పుడు డార్లింగ్ అభిమానుల కోరిక ఇంకో హీరో అభిమానుల మనసుని గాయపరుస్తుంది. గాయపరచడమే కాదు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుంది.
మన్యం వీరుడు, బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju)127వ జయంతి వేడుకలు హైదరాబాద్ లో చాలా ఘనంగా జరిగాయి. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకి ముఖ్య అతిధిగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఒక సినిమా చెయ్యమని ప్రభాస్‌ని కోరతాను. ఎందుకంటే ప్రభాస్ చేస్తే అల్లూరి మళ్లీ పుట్టినట్టే అనిపిస్తుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్‌ని చేయమని కోరతాను. గతంలో కృష్ణం రాజు గారు అల్లూరి పాత్రను చేద్దామనుకున్నారు. కానీ ఆ లోపే కృష్ణ గారు చేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అల్లూరి క్యారెక్టర్‌లో ప్రభాస్‌ను చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వారి విన్నపాన్ని నేను ప్రభాస్ కి వినిపిస్తాను ప్రభాస్‌ను ఆ పాత్రలో చూస్తే సీతారామరాజు మళ్లీ పుట్టినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. అది కూడా ప్రభాస్‌కి చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఈ మాటలే చరణ్ ఫ్యాన్స్ లో కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్(ram charan)అద్భుతంగా నటించాడు. చరణ్ ని తప్ప మరొకరిని అల్లూరిగా ఉహించుకోలేమంటు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభాస్ ని తప్ప అల్లూరిగా వేరే వాళ్ళని ఉహించుకోలేం. ప్రభాస్ అల్లూరిగా చెయ్యాల్సిందే అంటున్నారు. ఈ గొడవ ఎంత వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.