శుభ్రత పాటించని సిబ్బంది
సాధారణంగా గుడ్డులోని పచ్చ సొన, నిమ్మరసం, నూనెతో ఈ మయోనైజ్ తయారు చేస్తారు. తయారు చేసే క్రమంలో హోటల్ సిబ్బంది శుభ్రత పాటించలేదు. అందువల్లే బాధితులు అస్వస్థతకు గురై ఉంటారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శుభ్రత పాటించి తయారు చేసినా….నాలుగు గంటల్లోపే దాని తినెయ్యాలని లేదంటే మయోనైజ్ విషమంగా మారే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డిని ఈ ఘటనకు సంబంధించిన వివరణ కోరగా ……మయోనైజ్ వల్ల ప్రతీ నెల చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటల్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.