అవినీతి కేసులో అరెస్ట్ అయిన నటి జయలక్ష్మీకి దాదాపు నెలరోజుల తర్వాత బెయిల్ లభించింది. స్నేహం ఫౌండేషన్‌కు సంబంధించి జరిగిన అవినీతిలో నటి జయలక్ష్మీకి సంబంధం ఉందన్న కారణంతో గతనెల 20న తిరుమంగళం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఫుళల్ జైలుకు తరలించారు. ఆరోజు నుంచి ఇప్పటివరకు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు శక్రవారం బెయిల్ మంజూరు అయింది.
వివరాల్లోకి వెళితే.. స్నేహన్ మక్కళ్ నీది మయ్యం అనే నటుడు స్నేహం ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ పేరుతో నటి జయలక్ష్మీ విరాళాలు సేకరిస్తోందని, ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రస్ట్ నిర్వాహకుడు స్నేహన్ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గత నెల వరకు ఆమెపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. జనవరి 20న జయలక్ష్మీని అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు నెల తర్వాత ఆమెకు బెయిల్ రావడంతో శుక్రవారం జయలక్ష్మీకి బెయిల్ రావడంతో విడుదల చేశారు.