EntertainmentLatest News

అసెంబ్లీలో పవన్‌కళ్యాణ్‌.. పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ వైరల్‌!


మాయాజాలం చిత్రంతో నటిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనమ్‌కౌర్‌ ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మొత్తం ఓ పాతిక సినిమాలు చేసింది. కానీ, హీరోయిన్‌గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువ పాపులర్‌ అయింది. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్‌ పెడుతూ వార్తల్లోకి ఎక్కాలని ట్రై చేస్తుంటుంది. ఆమధ్య టాలీవుడ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ని బ్యాన్‌ చెయ్యాలంటూ గొడవ చేసింది. ట్రోలింగ్‌ వల్ల చనిపోయిన గీతాంజలి విషయంలో కూడా వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి రామ్‌గోపాల్‌వర్మ చేసిన కామెంట్స్‌పై కూడా స్పందించింది. ఇలా తనకు సంబంధం లేని విషయాల్లో సైతం ఆమె ఇన్‌వాల్వ్‌  అవుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పవన్‌కళ్యాణ్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా పూనమ్‌ కౌర్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

‘కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు’ అంటూ పూనమ్‌ చేసిన కామెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది అందరూ డిస్కస్‌ చేసుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల గురించే ఆ పోస్ట్‌ చేసిందని చాలామంది కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతున్న సమయంలో పూనమ్‌ ఇలాంటి పోస్ట్‌ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆమె ట్వీట్‌లో ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా చాలామంది వారికి అనుకూలంగా దాన్ని మార్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పార్టీకి సంబంధించిన కొందరు పూనమ్‌ ట్వీట్‌ని విస్తృతంగా ప్రచారం చేస్తూ విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తున్నారు. పూనమ్‌ ఈ పోస్ట్‌ పెట్టడం వెనుక ఉన్నది కూడా వారేననే వాదన కూడా వినిపిస్తోంది.



Source link

Related posts

ఇదేం విడ్డూరం.. కానిస్టేబుల్‌ పోస్టుకి దరఖాస్తు చేసిన హాట్‌ బ్యూటీ!

Oknews

Kalki 2898 AD 2 days collections కల్కి 2898 AD 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Oknews

నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను.. వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ సెల్ఫీ వీడియో!

Oknews

Leave a Comment