Top Stories

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కామెడీ.. న‌వ్వులే న‌వ్వులు!


అసెంబ్లీ స‌మావేశాలు వాడి, వేడిగా సాగుతున్నాయి. చంద్ర‌బాబు అరెస్ట్ తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ అసెంబ్లీ స‌మావేశాల్లో రెండో రోజు కూడా టీడీపీ స‌భ్యులు నిర‌స‌న‌కు దిగారు. విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వ్య‌వ‌హార శైలి రెండో రోజూ కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి ప్ర‌సంగం వ్యంగ్యంగా సాగింది. ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ మాన‌సిక ప‌రిస్థితిపై ఆయ‌న చేసిన కామెంట్స్‌పై అధికార ప‌క్ష స‌భ్యులు ప‌డిప‌డి న‌వ్వుకున్నారు. బియ్య‌పు మ‌ధుసూద‌న్ ప్ర‌సంగం ఎలా సాగిందంటే…

"వాళ్ల విజిల్స్ చూస్తుంటే కాలేజీలో అమ్మాయిల‌కు సైట్ వేసిన‌ట్టుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారా? అసెంబ్లీలో చంద్ర‌బాబు సీట్లో బాల‌కృష్ణ కూర్చున్నారు. పైనున్న ఎన్టీఆర్ ఎంతో సంతోషంగా వుంటారు. క‌నీసం నిజ జీవితంలో చేయ‌క‌పోయినా, అసెంబ్లీలో వ‌చ్చి బాబు సీట్లు కూచున్నారు.

ద‌య‌చేసి బాల‌కృష్ణను అసెంబ్లీలోకి రానివ్వొద్దు. ఎందుకంటే  మెంటల్‌గా స‌మ‌స్య వుంద‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ తెచ్చుకున్నారు. మ‌మ్మ‌ల్ని సైకో అంటున్నారు. అస‌లు సైకోలు వాళ్లే. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న త‌మ్ముడికి మెంట‌ల్‌. బాల‌కృష్ణ‌కు మెంట‌ల్ ఉన్న‌ట్టు స‌ర్టిఫికెట్ వుంది. బాల‌య్య గ‌న్ తీసుకొచ్చి నిన్ను (స్పీక‌ర్‌), న‌న్ను, అంద‌ర్నీ కాల్చేస్తాడు. ఏం కావాల సామి. కేసు కూడా ఉండ‌దు. ద‌య‌చేసి స‌ర్టిఫికెట్ చూసి లోప‌లికి పంపాల‌ని స్పీక‌ర్‌ను  వేడుకుంటున్నా. టీడీపీ స‌భ్యులంద‌రినీ స‌స్పెండ్ చేసి, మాన‌సిక వైద్య‌శాల‌కు పంపాలి" అని ఆయ‌న స్పీక‌ర్‌కు విన్నవించారు.

బాల‌య్య‌కు మెంట‌ల్ స‌ర్టిఫికెట్ వుంద‌ని చేత్తో చూపడం, అలాగే నిన్ను, న‌న్ను, అంద‌ర్నీ కాల్చేస్తాడ‌ని, ఏం కావాల సామి అని అంటూ బియ్య‌పు మధు ప్ర‌ద‌ర్శించిన హావ భావాలు అసెంబ్లీలో న‌వ్వులు విర‌జిల్లేలా చేశాయి. గ‌త స‌మావేశాల్లో కూడా ఇంగ్లీష్ రాక‌పోవ‌డం వ‌ల్ల అమెరికా ప్ర‌యాణంలో తాను ప‌డ్డ ఇబ్బందుల‌ను స‌ర‌దాగా ఆయ‌న చెప్పిన తీరుకు అంద‌రూ న‌వ్వారు.



Source link

Related posts

ప‌వ‌న్ ప‌దేళ్ల‌ రాజ‌కీయానికి ఇలాంటి ద‌మ్ముందా?

Oknews

ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక

Oknews

ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మం!

Oknews

Leave a Comment