దిశ, ఫీచర్స్: పచ్చి కలబంద వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు రంగు కలబంద ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎర్ర కలబంద మొక్క శుష్క ప్రాంతాలలో పెరుగుతుంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని “క్వీన్ అలోవెరా” అని పిలుస్తారు. దీనిలో విటమిన్ ఎ, సి, ఇ, బి12 , ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది:
ఎరుపు రంగు కలబందలో ఉండే సపోనిన్లు, స్టెరాల్స్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నొప్పి నుంచి ఉపశమనం:
ఎరుపు కలబందలోని సాలిసిలిక్ యాసిడ్, పాలీశాకరైడ్‌లు కండరాలను సడలించి మంటను తగ్గిస్తాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్‌ల నుండి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ కంట్రోల్:
రెడ్ కలబంద ప్రీ డయాబెటిస్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌కు పరిమిత పరిమాణంలో వినియోగం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సాగు పరిమితంగా ఉండటంతో పాటు మాత్రంగానే ఉన్నందున ధర ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.