Telangana

ఆటోడ్రైవర్లకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలు అనుమతి-yadadri news in telugu autos allowed to yadadri temple hill after two years ,తెలంగాణ న్యూస్



Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించారు అధికారులు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటోలో ఎక్కించుకుని ఎమ్మెల్యే ఐలయ్య స్వయంగా కొండపైకి తీసుకెళ్లారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…గత పాలకులు రెండేళ్లుగా ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆటో కార్మికుల కోసం దొంగ ఏడుపు ఏడుస్తున్నారని విమర్శించారు. యాదాద్రి అభివృద్ధిలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిచారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. యాదాద్రి కొండపైకి రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.



Source link

Related posts

TSGENCO Assistant Engineer and chemist Hall Ticket release delayed due to LS Polls Check official notice here | TSGENCO ఏఈ, కెమిస్ట్ పరీక్షలు వాయిదా?

Oknews

Ayodhya Free Darshan : తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మందికి ఫ్రీగా అయోధ్య దర్శనాలు, ఎలాగంటే?

Oknews

BJP Janasena Alliance: రేపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ, జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం?

Oknews

Leave a Comment