సినిమా కథలోను, మేకింగ్ లోనే కాదు పబ్లిసిటీ లోను ట్రెండ్ మారింది. ఈ రోజుల్లో ఒక సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీ చాలా ముఖ్యం అయిపోయింది. ఒక రకంగా పబ్లిసిటీ ని 25 th క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయంలో ఒక నయా మూవీ హాట్ టాపిక్ గా మారింది.
2014 లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ గీతాంజలి. హర్రర్ ఎలిమెంట్స్ తో రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. తాజాగా ఆ మూవీకి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది రాబోతుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ చేస్తున్న పబ్లిసిటీ మూవీ మీద అందరిలోను ఆసక్తిని పెంచుతుంది. ఆత్మల ఆత్మగౌరవాన్ని పరిగణలోకి తీసుకుంటూ భయబ్రాంతులకి గురవుతున్న మా యూనిట్ సభ్యులని అర్ధం చేసుకుంటూ స్నేహితులు పాత్రికేయ మిత్రుల సలహాలని గౌరవిస్తు మా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని దసఫల్లా కన్వెన్షన్ కి మార్చడమైనది అని ఒక పోస్టర్ రిలీజ్ చేసి చెప్తున్నారు.ఇప్పుడు ఇది నయా ట్రెండ్ కి క్రియేట్ చేసిందని చెప్పవచ్చు
కోన ఫిలిం కార్పోరేషన్ పై గీతాంజలి మొదటి భాగాన్ని నిర్మించిన కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎంవివి సత్యనారాయణ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్,సునీల్, షకలక శంకర్, అలీ ఇలా దాదాపు మొదటి భాగంలోని నటులందరూ గీతాంజలి మళ్ళీ వచ్చింది లో ఉన్నారు. కాగా రెండు రోజుల క్రితం టీజర్ లాంచ్ బేగం పేట శ్మశాన వాటికలో ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఇప్పుడు దసఫల్లా కి మారింది. శివ తుర్లపాటి దర్శకుడు.