Health Care

ఆదివారం రోజు ఈ పనులు చేస్తే అష్ట దరిద్రమేనట..! అవేంటంటే..?


దిశ, ఫీచర్స్: జోతిష్య శాస్త్ర ప్రకారం వారాల్లో కొన్ని కొన్ని రోజులు ఈ పనులు చెయ్యకూడదు అని ఉంటుంది. ఉదాహరకు సోమవారం నువ్వులు తీసుకోకూడదు, శనివారం ఆయిల్ ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇలాంటివి అనేక సెంటిమెంట్లు ఉంటాయి. అలాగే ఆదివారం కూడా కొన్ని పనులు చెయ్యకూడదట. తెలిసి చేసిన తెలియక చేసిన దరిద్రం వెంటాడుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే.. అష్ట దరిద్రాలు తగులుకుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆదివారం సెలవు దినం కారణంగా చాలా మంది బ్యూటీషన్‌కు సంబంధించిన పనులు ఎక్కువగా చేసుకుంటారు. జుట్టు, గోర్లను కత్తిరించడం వంటి పనులు చేస్తారు. అయితే.. అవి చెయ్యకూడదట.

* ఆదివారం నాడు సూర్యాస్తమయ సమయంలో ఉప్పును తినకూడదట. ముఖ్యంగా మీ గ్రహానికి అధిపతి సూర్యేడే అయినప్పుడు అలాంటి వారు అస్సలు తినకుండ ఉంటేనే సూర్య భగవానుని ఆశీస్సులు అందుతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు.

* ఇక చాలా మంది ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం ఆదివారం మాంసాహారం తీసుకోకూడదట. మందు తాగకూడదట.

* అలాగే ఆదివారం రాగి వస్తువులను కొనడం లేదా అమ్మడం చెయ్యకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

* ఆదివారం నాడు మీరు ఈ పనులకు దూరంగా ఉంటే సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి మంచి జరుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్యూలు. అయితే.. జ్యోతిష్య శాస్త్రాలను నమ్మని వారు మాత్రం ఇవన్ని మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తున్నారు.



Source link

Related posts

ఆగకుండా డ్యాన్స్ చేయడం కూడా ఓ వ్యాధి అని తెలుసా?

Oknews

వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించే పానీయాలు ఇవే..

Oknews

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? బంగాళదుంపతో శాస్వత పరిష్కారం.. ఎలాగంటే?

Oknews

Leave a Comment