దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇలాంటి కేసులో గతంలో ఒకరిని అరెస్ట్ చేశామని…… తాజాగా అదే ముఠాకు చెందిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బును దుబాయ్ కు పంపి హవాల్ ద్వారా తిరిగి ఇండియాకు తెప్పించుకుంటున్నారని ఆయన తెలిపారు. మీట్ తిమ్మినియా, బ్రిడ్జెస్ పటేల్, హర్ష పాండ్యా, శంకర్ లాల్ అనే ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించామని, వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Source link