Andhra Pradesh

ఆన్ లైన్ మోసం.. ఈసారి ఏకంగా రూ.98 లక్షలు


ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి ఆన్ లైన్ మోసం బారిన పడి ఏకంగా 98 లక్షలు పోగొట్టుకున్నాడు.

ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తే అత్యధిక ఆదాయం వస్తుందనే ప్రకటన చూసి ఆశపడ్డాడు హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ పటాన్ చెరు ప్రాంతంలో ఉండే ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు 17వ తేదీన ఈ మెసేజ్ వచ్చింది.

అసలు ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాడు. లింక్ క్లిక్ చేశాడు. ముందుగా కొంత మొత్తం ‘పెట్టుబడి’గా పెట్టాడు. భారీగా డబ్బు వచ్చింది. దీంతో ఆశ పెరిగింది. మరింత మొత్తం పెట్టాడు. అలా తన మొత్తాన్ని పెంచుకుంటూ పోయాడు.

అలా 98 లక్షల 40వేల రూపాయలు పెట్టిన తర్వాత, తను మోసపోయానని గ్రహించాడు. వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

దాదాపు ఇదే తరహా మోసానికి హైదరాబాద్ లోని ఓ వ్యాపారవేత్త కూడా దొరికిపోయాడు. క్వాంటమ్ క్యాపిటల్ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. ముందుగా బిట్ కాయిన్ లో పెట్టాడు. బాగా డబ్బులొచ్చాయి. దీంతో దశలవారీగా మూడున్నర లక్షలు పెట్టి మోసపోయాడు.

The post ఆన్ లైన్ మోసం.. ఈసారి ఏకంగా రూ.98 లక్షలు appeared first on Great Andhra.



Source link

Related posts

Sai Reddy stuck in lift: స్మృతివనం లిఫ్ట్‌లో చిక్కుకున్న సాయిరెడ్డి, వైసీపీ నేతలు

Oknews

InnerRingRoad Case: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సిఐడి చార్జిషీట్.. ఏ1గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Oknews

అక్టోబర్ 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు-tirumala srivari navaratri brahmotsavam 2023 from october 15 to 23th vahana sevas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment