మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నయా మూవీ ఆపరేషన్ వాలంటైన్. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి.ట్రైలర్ కూడా సూపర్ గా ఉండటంతో మూవీ కోసం అందరు రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఈ రోజు ప్రీమియర్ షోస్ కూడా పడుతున్నాయి.ఇప్పడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆపరేషన్ వాలంటైన్ ని సోనీ పిక్చర్స్ అండ్ సందీప్ ముద్దా,నందకుమార్ అబ్బినేని లు అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ కి ముందే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చారనే వార్తలు వస్తున్నాయి.ఓటిటి రైట్స్ ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ నుంచి 26 కోట్లు. నాన్ థియేట్రికల్ కి సంబంధించి హిందీ హక్కుల నుంచి 14 కోట్లు మ్యూజిక్ రైట్స్ కి 2 .5 కోట్లు .తెలుగు సాటిలైట్ డీల్ కి సంబంధించి 6 .5 కోట్లు ఇలా మొత్తం సుమారు 50 కోట్లు దాకా దక్కించుకుందని అంటున్నారు
వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ జోడి కడుతుండగా నవదీప్, రుహాణి శర్మ, పరేష్ పహుజా, షతప్ ఫైగర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శక్తీ ప్రతాప్ సింగ్ రచనా దర్శకత్వంలో తెలుగు ,హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ఈ మూవీకి సెన్సార్ నుంచి యు /ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 4 నిమిషాల నిడివితో సినిమా ఉండబోతుంది. 2019 లో మన దేశం మీద పాకిస్థాన్ జరిపిన దాడులకి ప్రతీకారకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంతో చిత్రం తెరకెక్కింది.