ByGanesh
Sun 10th Mar 2024 12:29 PM
వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకులు ప్రశంశల జల్లు కురిపించినా.. ఈ చిత్రం థియేటర్స్ లో అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. దానితో కలెక్షన్స్ పరంగా వీక్ అనిపించింది. ఈ రకమయిన కంటెంట్ ని ప్రేక్షకులు థియేటర్స్ లో కన్నా ఓటీటీలో చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. విజువల్ ఎఫక్ట్స్, వరుణ్ తేజ్ యాక్షన్, శక్తి ప్రతాప్ మేకింగ్ స్టయిల్ అన్ని బావున్నప్పటికీ.. ఈ చిత్రం మేకర్స్ అనుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయింది.
టాలీవుడ్ నుంచి తక్కువ బడ్జెట్ లో మంచి విజువల్స్ తో ఆడియన్స్ ని తో ఇంప్రెస్స్ చేసిన ఆపరేషన్ వాలెంటైన్ హిందీలో కూడా మార్చ్ 1 నే విడుదలైంది. ఇక ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. తెలుగు సహా హిందీలో.. ఈ మార్చ్ 29 నుంచే స్ట్రీమింగ్ కి చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Operation Valentine OTT date loecked?:
Operation Valentine OTT details out