GossipsLatest News

ఆపరేషన్ వాలెంటైన్ పబ్లిక్ టాక్


వరుణ్ తేజ్ – శక్తి ప్రతాప్ కాంబోలో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనుషి చిల్లర్, రుహాని శర్మ హీరోయిన్స్ గా నటించి ఈ చిత్రం తెలుగు, హిందీలో మార్చ్ 1 న విడుదలయ్యింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని పేక్షకుల్లోకి తీసుకెళ్లిన తీరు, ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ట్రైలర్, పోస్టర్స్ అన్ని ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ చేసాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో పబ్లిక్ టాక్ లో చూద్దాం.. 

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని గత రాత్రి ప్రీమియర్స్ లోనే వీక్షించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ 

కమర్షియల్ సినిమాలు వారానికి ఒకటి వస్తుంటాయి..

ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి..

సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే ఇలాంటి ప్రయత్నమే ఓ సాహసం..

అందులో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడు..

సుత్తి లేకుండా సూటిగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు శక్తి ప్రతాప్..

ఆపరేషన్ వాలెంటైన్ కోసం బాగానే రీసర్చ్ చేశారు మేకర్స్..

పుల్వామా అటాక్స్ సీన్ ఆసక్తికరంగా ఉంది..

అక్కడ్నుంచి కథ మరింత వేగంగా ముందుకెళ్లింది..

ఫస్టాఫ్ కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ మాత్రం బాగుంది..

ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ సీన్ విజువల్ గా బాగుంది..

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్.. అలాగే VFX కూడా ఆకట్టుకుంటుంది..

క్లైమాక్స్ లో వచ్చే వందేమాతరం RR ఎలివేషన్ ఇంకా పెంచింది..

వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్ కోసం చాలా మేకోవర్ అయ్యాడు.. స్క్రీన్ మీద కనిపించింది..

మనుషి చిల్లర్, రుహాని శర్మ ఇద్దరూ ఆకట్టుకున్నారు..

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తనవరకు అయినంత ప్రయత్నించాడు..

ఓవరాల్ గా ఆపరేషన్ వాలెంటైన్.. ఎంగేజింగ్ ఎయిర్ ఫోర్స్ డ్రామా..



Source link

Related posts

nutriaide app to keep your diet in check

Oknews

Manchu Manoj Wife Mounika Baby Bump Photos మంచు మనోజ్ వైఫ్ మౌనిక బేబీ బంప్ ఫొటోస్

Oknews

రాజమౌళి వల్లే ఇదంతా.. 'అహో విక్రమార్క' టీజర్ లాంచ్ ‌ఈవెంట్‌లో దేవ్ గిల్!

Oknews

Leave a Comment