EntertainmentLatest News

‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ రివ్యూ.. ఊహించని రెస్పాన్స్!


విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల ఘోర పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ఆయన నటించిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’పైనే ఆశలు పెట్టుకున్నాడు. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులకి స్పెషల్ షో వేయగా.. అందరూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో గూస్‌బంప్స్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయట. బలమైన ఎమోషన్స్ తో కూడిన పర్ఫెక్ట్ ఏరియల్ ఫిల్మ్ అని అంటున్నారు. పుల్వామా ఎటాక్ విజువల్స్ అయితే ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేలా ఉన్నాయట. ఇంటర్వెల్ ని, క్లైమాక్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారని.. బీజీఎం, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయని చెబుతున్నారు. 

ఇండస్ట్రీ వర్గాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమాతో వరుణ్ తేజ్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.



Source link

Related posts

ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ బాటలో అఖిల్.. ఏం ప్లాన్ చేశావయ్యా!

Oknews

72 థియేటర్లతో స్టార్ట్‌ అయి.. నాలుగు రోజుల్లోనే 120 థియేటర్లలో ‘ఇంటి నెం.13’

Oknews

Telangana Former Dy Cm Rajaiah May Quit Brs he joins to congress

Oknews

Leave a Comment