Health Care

ఆపిల్ సైడర్ వెనిగర్ తో మెరిసే జుట్టు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..


దిశ, ఫీచర్స్ : మీ జుట్టు పొడిబారి, నిర్జీవంగా ఉందా అయితే ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టుకు గొప్ప క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. అంతే కాదు ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఈ వెనిగర్ స్కాల్ప్‌ని మెయింటెయిన్ చేయడానికి పని చేస్తుంది. జుట్టు రాలకుండా, పాడవకుండా కాపాడుతుంది. అయితే ఈ వెనిగర్ ని నేరుగా జుట్టు కి అప్లై చేయకూడదు. అలా చేస్తే అది మీ జుట్టుతో పాటు మీ తలకు కూడా హాని కలిగిస్తుంది. అలాగే ఈ వెనిగర్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.

ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఉపయోగించే మార్గాలు..

1 : ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ ను పోనీతో కలపండి. ఒకటి కంటే ఎక్కువ టీస్పూన్ వెనిగర్ ని ఉపయోగించకూడదు.

2 : ఈ ద్రావణాన్ని మీ జుట్టుకు పెట్టేముందు షాంపూ, కండీషనర్‌తో మీ జుట్టును బాగా కడగాలి. జుట్టు కడిగిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ ద్రావణాన్ని మీ తలకు అప్లై చేయాలి. తర్వాత కొన్ని నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. కొంత సమయం తరువాత నీటితో జుట్టును బాగా కడగాలి.

3 : మీ జుట్టు పై రసాయన ఉత్పత్తులను పూయడం మానుకోవాలి.

మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు..

1. జుట్టు రాలడం తగ్గుతుంది

జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడాలి. ఇది పొడి, నిర్జీవమైన జుట్టును మృదువుగా చేస్తుంది. ఉపయోగించిన కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

2. హెయిర్ ఫ్రిజ్ ఫ్రీ అవుతుంది

పొడి జుట్టు తరచుగా గజిబిజిగా మారుతుంది. దీనికి హైడ్రేషన్ చాలా అవసరం. జుట్టు చిట్లి ఉంటే దాన్ని వెనిగర్ తో సరిచేసుకోవచ్చు. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ మీ జుట్టు పొడిబారకుండా, చిట్లకుండా కాపాడుతుంది.

3. జుట్టును మెరిసేలా చేస్తుంది

నిస్తేజంగా, నిర్జీవమైన జుట్టుతో ఇబ్బంది పడుతుంటే, హెయిర్ వాష్ కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించండి. ఇది జుట్టు క్యూటికల్స్‌ను మూసేయడం ద్వారా జుట్టును మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఇది జుట్టు మెరుపును కూడా పెంచుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా తలలో pH స్థాయి పెరుగుతుంది. దీంతో చుండ్రును కూడా నియంత్రించవచ్చు.



Source link

Related posts

ఏలకులతో మెరిసే ముఖం.. ఎలాగో చూడండి..

Oknews

సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ టిప్స్ పాటించండి!

Oknews

వయాగ్రాలా పని చేస్తున్న జామకాయ.. తింటే రెచ్చిపోవడం ఖాయమంట!

Oknews

Leave a Comment