దిశ, ఫీచర్స్: ఉద్యోగస్థులంతా మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్లడం.. ప్రయాణం చేయడం.. రోజంతా వర్క్ చేయడం, ఇంటికి తిరిగి వెళ్లడం.. వీటన్నింటి మధ్య చాలా మంది శారీరకంగా అలసిపోతున్నారు. ఏ జాబ్ చేసినా కనీసం 8 గంటలు కష్టపడాల్సిందే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. వర్క్ చేసేటప్పుడు అలసిపోవడానికి ఇదో కారణమని చెప్పుకోవచ్చు. అయితే రోజంతా గంటల తరబడి పని ఒత్తిడితో బిజీగా ఉంటూ శారీరకంగా వీక్ అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు కొన్ని టిప్స్‌ను పాటించండి. ఈ చిట్కాలు మీ అలసటను ఇట్టే దూరం చేస్తుంది. ఆఫీసు వర్క్ లేదా వర్క్‌ఫ్రం హోం ఏదైనా సరే, పని తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తే ఈ బెస్ట్ చిట్కాలు పాటించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అలసట నుంచి ఉపశమనం పొందే బెస్ట్ చిట్కాలు..
వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో అలసటగా అనిపించినప్పుడు ఏమైనా స్నాక్స్ లాంటివి తీసుకోండి. అలాగే ఐదు నిమిషాలు వాకింగ్ చేయండి. వాటర్ ఎక్కువగా తాగండి. దీంతో స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారు. అలాగే మెదడు చురుగ్గా పని చేస్తుంది. కొత్త ఉత్సాహాన్ని తెప్పిస్తోంది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. అలసటను నుంచి ఉపశమనం పొందేందుకు వెంటనే స్నానం చేయండి. స్నానం చేయడం వల్ల తాజా అనుభూతిని కలిగిస్తుంది. అలాగే మీ మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
సాంగ్స్ వినడం..
ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. 10 నిమిషాలు మీకు నచ్చిన సాంగ్స్ వినండి. మీ స్ట్రెస్ ను తగ్గించి.. రిలీఫ్‌ను ఇస్తాయి. దీంతో మీరు ఇంట్లో పనుల్ని చురుగ్గా చేసుకోవచ్చు.
వాకింగ్ చేయడం..
ఆఫీసు వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే మీ ఇంట బయట లేదా బల్కానీలో కాసేపు వాకింగ్ చేయండి. వాకింగ్ అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చాలా మంది రాగానే పడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు కానీ పడుకోవడం వల్ల ఎక్కువ అలసిపోయే అవకాశాలున్నాయి. కానీ రిలీఫ్ పొందలేరు.
ధ్యానం చేయడం..
ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక అలసిపోయినట్లు అనిపిస్తే.. ధ్యానం చేయండి. మీ మనస్సు చాలా తేలికగా అనిపిస్తుంది. అలసట నుంచి విముక్తి పొందడానికి బెస్ట్ టిప్ ధ్యానం అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోన్‌కు.. కాసేపు దూరంగా ఉండండి. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల మీ మెదడు అలసిపోయే చాన్స్ ఉంటుంది.