దిశ, ఫీచర్స్ :ప్రస్తుతం ఉన్న జీవనశైలి, మనం తీసుకుంటున్న ఆహారం అంతే కాకుండా మనం చేస్తున్న పని కూడా మన ప్రాణానికి ముప్పు తీసుకొస్తుంది. ఇప్పుడున్న వారు తమ శరీరానికి ఏ మాత్రం పని చెప్పడం లేదు. గంటల తరబడి చైర్‌లో కూర్చొని, సిస్టమ్‌కే పరిమితం అవుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓ సర్వే ప్రకారం..ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వలన అకాల మరణాల ముప్పు 30 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ పరిశోధన ప్రకారం, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బరువు పెరిగి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.ఎక్కువ సేపు ఎలాంటి వ్యాయామం లేకుండా కూర్చోవడం వలన వ్యక్తి ఈజీగా బరువు పెరుగుతారు. అయితే ఇది మధుమేహంకు దారితీస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చొవడం వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం. అధిక బరువే కాకుండా బరువు లేని వారిలో కూడా ఈ రిస్క్ ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే ఒకే చోట కూర్చోవడం వలన శరీరానికి రక్త ప్రసరణ జరగడంలో ఇబ్బందులు ఎదురవుతాయంట, దీంతో గుండె ధమనులు గట్టిపడి స్ట్రోక్ వస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వలన కండరాల బలహీనత, బ్లడ్ షుగర్,ఎముకల బలహీనత లాంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట. కాబట్టి ఎక్కువ సేపు కూర్చోకుండా కనీసం, ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం 3 నుండి 5 నిమిషాలు అటు ఇటు తిరాగలంటున్నారు వైద్యులు.