Top Stories

ఆయన్ని సీఎం చేయడం కోసం రంగంలోకి స్వామి


తెలంగాణ ఎన్నికలు రసపట్టుగా సాగుతున్నాయి. ఎవరికి వారే మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అని ప్రచారం సాగుతోంది. లేదు కేసీఆరే మళ్లీ మూడవసారి సీఎం అవుతారు అని బీఆర్ఎస్ నేతలు పూర్తి విశ్వాసంతో  చెప్పుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో రాజకీయ రణ క్షేత్రం నుంచి కేసీఆర్ భక్తి వైపు మొగ్గారు. 2018లో చేసినట్లుగానే రాజశ్యామల యాగాన్ని ఆయన చేస్తున్నారు. గతంలో అమ్మ కరుణ కూడా తోడు అయి రెండవసారి కేసీఆర్ సీఎం అయ్యారన్న సెంటిమెంట్ బీఆర్ఎస్ లో ఉంది.

ఇప్పుడు మూడవసారి తాను సీఎం కావడానికి కేసీఆర్ రాజశ్యామల అమ్మ వారిని మొక్కుతున్నారు. గతంలో కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేయించిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్రస్వామి మారోమారు రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం మొదలైంది.

మూడు రోజుల పాటు జరిగే ఈ యాగం పూర్తిగా కేసీఆర్ సొంత ఖర్చుతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో సాగుతోంది. సిద్ధిపేట జిల్లాలోని  ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వేదికగా జరుగుతున్న ఈ యాగం మీద తెలంగాణలో ఆసక్తి నెలకొంది. మొత్తం రెండు వందలకు పైగా పురోహితులు ఈ యాగంలో పాల్గొంటున్నారు.

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్‌ యాగం చేస్తున్నారు అని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. కేసీఆర్ దంపతులు భక్తి ప్రపత్తులతో స్వామికి పాదాభివందనం చేసి యాగంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుందని కొన్ని సర్వేలు వెలువడుతున్నాయి. ఈ సర్వేలతో పాటు అమ్మ వారి దయ కూడా కేసీఆర్ మీద నిండుగా ఉంటుందని ఆయనే మూడవసారి సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నారు. 

కేసీఆర్ ని మళ్ళీ సీఎం చేస్తామని స్వరూపానందేంద్ర మహా స్వామి రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల ఫలితాల మీద ఆధ్యాత్మికపరుల దృష్టి కూడా పడుతోంది.



Source link

Related posts

అడవి శేష్ మీద 150 కోట్లు

Oknews

బాబు ప్రాణానికి ముప్పు.. వైసీపీ హత్య చేసుకున్నట్లే..!

Oknews

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'మాన్షన్ 24'

Oknews

Leave a Comment