ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడమే కాకుండా అవార్డులను కూడా గెలుచుకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్ అవార్డునే గెలుచుకోగా, 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరో పొందని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రెండు సినిమాలపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
తాను ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలను చూసేందుకు ప్రయత్నించానని, అయితే హైపర్ మాస్కులినిటీని చిత్రీకరించడం వల్ల రెండు సినిమాలనూ పూర్తిగా చూడలేకపోయానని చెప్పుకొచ్చాడు. హైపర్ మాస్కులినిటీ అంటే అతి హీరోయిజం అనే అర్థం వస్తుంది. అందువల్లే తాను ఆ సినిమాలను చూడలేకపోయానని వెల్లడిరచాడు. అలాగే మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ కూడా చూశానని, మణిరత్నం అజెండా లేని దర్శకుడని వ్యాఖ్యానించాడు. ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా ప్రేక్షకులు ఏం పొందుతారో తాను చెప్పలేనని అన్నాడు. పౌత్ నుంచి వచ్చే సినిమాలు ఎక్కువ ఊహాజనితంగా ఉంటాయని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నసీరుద్దీన్ షా కు కొత్తేమీ కాదు. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, గదర్ చిత్రాల విజయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.