Entertainment

ఆర్టికల్ 370 కి వచ్చిన కలెక్షన్లు 


కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వస్తాయి..రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సృష్టిస్తాయి..బయ్యర్లకి కనక వర్షాన్ని కురిపిస్తాయి.. ఈ కోవలోనే గత నెల ఫిబ్రవరి 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్టికల్ 370 .ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకపోయినా కూడా విజయపధాన దూసుకెళ్లిపోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్  పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

  

ఆర్టికల్ 370 టోటల్ గా 20 కోట్ల బడ్జట్ తో రూపొందింది. కాగా ఇప్పటివరకు 70 కోట్ల  వరకు సాధించింది. మూవీ వచ్చి ఇప్పటికి నెల రోజులు దాటినా కూడా కలెక్షన్స్  మాత్రం తగ్గడం లేదు. వీకెండ్స్ లో  అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది.మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఇంకో ఇద్దరకీ చెప్పడంతో సినిమా విజయం ఇంకా పెరిగే అవకాశం ఉంది.   ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారి జూని క్యారక్టర్ లో  యామి గౌతమ్ నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సీనియర్ నటీమణి  ప్రియమణి పీఎం సెక్రటరీ గా జీవించింది. మిగతా పాత్రలని పోషించిన వాళ్ళందరూ కూడా  చాలా చక్కగా ఒదిగిపోయి చేసారు. 

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ  ఆర్టికల్ 370 ఏర్పడింది. దాని ప్రకారం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.అలాగే  బయటి వ్యక్తులు ఎవరు  జమ్మూ కాశ్మీర్లో  భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు.ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2019 ఆగష్టు  5 న ఆర్టికల్ 370 ని రద్దు చేసారు. ఆ రద్దు కోసం ఆయన నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ, ఎన్ ఐ ఏ ఎలా పోరాడింది  అనే పాయింట్ తో మూవీ రూపుదిద్దుకుంది.

  

 



Source link

Related posts

bigg-boss-3-telugu-winner-rahul – Telugu Shortheadlines

Oknews

అండగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలు.. థాంక్స్‌ చెప్పిన త్రిష!

Oknews

నవీన్ చంద్ర కోసం రంగంలోకి దిగిన కాజల్ అగర్వాల్!

Oknews

Leave a Comment