EntertainmentLatest News

ఆర్ నారాయణమూర్తి ఉన్న హాస్పిటల్ కి కేటిఆర్ ఫోన్   


సోషల్ మీడియా యుగంలో కూడా ఎన్నో విప్లవాత్మక చిత్రాలని తెరకెక్కించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన హీరో, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి(r narayana murthy)గత కొన్ని రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకి  లోనయిన విషయం తెలిసిందే . దీంతో అభిమానులు ఎంతగానో ఆందోళన చెందారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ మూర్తి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ విషయంపై   తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎంఎల్ఏ కల్వకుంట్ల తారకరామారావు  స్పందించారు.

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స  తీసుకుంటున్న ఆర్ నారాణమూర్తికి కేటిఆర్(ktr)ఫోన్ చేసారు. స్వయంగా నారాయణమూర్తి నోటి నుంచే  ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని నారాయణ మూర్తి కి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా  తెలిపారు.  ఇప్పుడు ఈ సంఘటనతో  బిఆర్ఎస్ పార్టీ కళాకారులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మరోసారి అర్ధమయ్యింది. అదే విధంగా కె టి ఆర్ కి నారాయణ మూర్తికి మధ్య మంచి అనుబంధం ఉంది.

 



Source link

Related posts

kajal aggarwal marriage photos: ముంబైలో ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి…అనుకోకుండా షాకింగ్ ఘటన

Oknews

Is this why ChandraBabu alliance with BJP? బాబు బీజేపీతో పొత్తు అందుకేనా?

Oknews

Allotment Of BSP Seat To Transgender In Warangal | BSP Seat To Transgender: బీఎస్పీ రెండో జాబితా విడుదల

Oknews

Leave a Comment