EntertainmentLatest News

‘ఆర్ యు ఓకే బేబీ’ మూవీ రివ్యూ


మూవీ: ఆర్ యు ఒకే బేబీ

నటీనటులు: సముద్రఖని, అభిరామి, మల్లై అరసి, అశోక్ కుమార్ బాలకృష్ణన్, లక్ష్మీ రామకృష్ణన్, సి.జి. కుమార్ తదితరులు

ఎడిటింగ్: సీఎస్ ప్రేమ్ కుమార్

సినిమాటోగ్రఫీ: కృష్ణ శేఖర్

మ్యూజిక్: ఇళయరాజా

నిర్మాతలు:  రామకృష్ణన్, గోపాలకృష్ణన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీ రామకృష్ణన్

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్

తమిళంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ‘ఆర్ యూ ఓకే బేబీ’ మూవీ తెలుగు వెర్షన్ తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. సముద్రఖని, అభిరామి ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కేరళలోని ఒక ఊరిలో బాలచంద్రన్(సముద్రఖని), విద్య(అభిరామి) అనే ఇద్దరు భార్యాభర్తలు ఒక పాపతో సంతోషంగా జీవిస్తుంటారు. వాళ్ల కూతురికి అన్య అనే పేరు పెట్టుకొని సంబరపడతారు. అలా హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలోకి ఒక ఫోన్ కాల్ రావడంతో అల్లకల్లోలమవుతుంది. వాళ్ళిద్దరూ ఆప్యాయంగా చూసుకుంటున్న ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు కాదని, ఒకరి దగ్గర నుండి తెచ్చుకున్నారని తెలుస్తుంది. ఆ పాప వాళ్ళ కన్నతల్లి శోభా(మల్లై అరసి) పాప కోసం కోర్టుని ఆశ్రయిస్తుంది. మరి ఆ పాప అన్యని కన్నతల్లి శోభా సొంతం చేసుకుందా? లేక బాల చంద్రన్, విద్యలు సొంతం చేసుకున్నారా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఒక పాపని దత్తత తీసుకొని పెంచుకుంటున్న బాలచంద్రన్, విద్యల లైఫ్ లోకి వచ్చిన సమస్యతో ఈ కథ ఆసక్తిగా మొదలవుతుంది.  కథ మొదలైన తర్వాత ఒక్కో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ నెమ్మదిగా సాగుతుంది. కథ మెయిన్ పాయింట్ ని చక్కగా ముందుకు తీసుకెళ్ళారు డైరెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్. ఇప్పుడు సమాజంలో పెరిగిపోతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం కొన్ని కఠినమైన రూల్స్ ని తీసుకొచ్చిందంటూ కథనం ఒక ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తుంది.

అయితే ప్రథమార్ధం నెమ్మదిగా సాగుతుంది. ఎందుకంటే ఈ పాపని దత్తత తీసుకున్న విధానాన్ని సీబీఐ వాళ్ళు మొదటి నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తూ కాస్త నెమ్మదిగా సాగింది. ఇలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో దత్తత తీసుకున్నవాళ్ళ దగ్గర బేబీ ఉండటం బాగుంటుందని భావించి, కోర్టుకి నిజాలని చూపించకపోవడం కాస్త లాజిక్ లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ పోలీసులు చట్టాన్ని ధిక్కరించి ఒక అమ్మ పడే బాధని తెలుసుకొని సరైన న్యాయాన్ని చేసినట్టుగా కన్విన్స్ చేశారు. 

బేబీ కోసం కన్నతల్లి శోభా పడే  బాధ ద్వితీయార్థంలో కన్నీళ్ళు పెట్టిస్తుంది. సమాజంలో అక్రమంగా చిన్నపిల్లలని డబ్బులకు అమ్ముకునే అమ్మలకి ఈ సినిమా ఒక గుణపాఠంలా ఉంటుంది. పెంచే స్తోమత లేనప్పుడు కనకూడదంటూ కోర్ట్ రూమ్ లో లాయర్ వాదనని న్యాయమూర్తి అంగీకరించడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ప్రతీ ప్రేక్షకుడిని ఎమోషనల్ చేస్తుంది. పిల్లలు లేని వారు చట్టప్రకారం దత్తత తీసుకోవాలంటూ ఇచ్చే మెసేజ్ బాగుంది. అయితే ఈ మూవీ నిడివి ఒక గంట నలభై ఆరు నిమిషాలే ఉన్నా.. కథలో సాగే సీన్లు నెమ్మదిగా ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది‌. కృష్ణ శేఖర్ సినిమాటోగ్రఫీ అదనపు బలం‌. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు పనితీరు:

బాలచంద్రన్ గా సముద్రఖని, విద్యగా అభిరామి ఈ సినిమాకి ప్రధాన బలం‌. శోభగా ముల్లై అరసి తన నటనతో సినిమాకి ప్రాణం పోసింది‌. త్యాగిగా అశోక్ కుమార్ బాలకృష్ణన్, రష్మీ రామకృష్ణన్ గా లక్ష్మీ రామకృష్ణన్ ఆకట్టుకున్నారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

పిల్లలు లేనివారు చట్టప్రకారమే దత్తత తీసుకోవాలని చెప్తూ, తల్లి ప్రేమని తెలియజేస్తూ తీసిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడొచ్చు.

రేటింగ్: 3/5 

✍🏻. దాసరి మల్లేశ్



Source link

Related posts

Minister Seethakka turns into Teacher in Jagganna peta of Mulugu district

Oknews

‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్‌ లాంచ్

Oknews

మరణించిన తర్వాత కూడా జీవించండి.. చేసి చూపించిన డేనియల్‌ బాలాజీ!

Oknews

Leave a Comment